CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎమ్మెల్యే మెచ్చ ఇంటి ముట్టడి,పోడు భూములకు పట్టాలిస్తారా MLA పదవికి రాజినామా చెస్తారా.

Share it:

 


                                       

 మన్యం టివి,దమ్మపేట:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం,తాటి సుబ్బన్న గూడెం గ్రామంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఇంటినిముట్టడించిన సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ కార్యకర్తలు.

పోడు భూములకు పట్టాలు ఇస్తారా లేక రాజీనామా చేస్తారా.సాగు దారులపై అటవీ అధికారుల దాడులు ఆపాలని అక్రమ కేసులు ఎత్తివేయాలని 2006లో అటవీ హక్కుల చట్టం ప్రకారం సాగులో ఉన్న పోడు భూములు అన్నింటికీ హక్కు పత్రాలు ఇవ్వాలని సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ అఖిల భారత రైతు కూలీ సంఘం(AIKMS) ఆధ్వర్యంలో అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఇల్లు ముట్టడించడం జరిగింది.రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా ఎమ్మెల్యేలు మంత్రుల రాజీనామాలు చేస్తారా లేక పోడు భూములకు పట్టాలు ఇస్తారా అనే పిలుపు మేరకు ఎమ్మెల్యే ఇల్లు ముట్టడించడం జరిగింది. 

అనంతరం జరిగిన ముట్టడి కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పాల్వంచ డివిజన్ కార్యదర్శి అమర్లపూడి రాము,అఖిల భారత రైతు కూలీ సంఘం పాల్వంచ డివిజన్ కార్యదర్శి జి ప్రభకర్ లు మాట్లాడుతూ 

కెసిఆర్ రాష్ట్రంలో అధికారంలోకి రావటానికి గత రెండు అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో పోడు భూములకు పట్టాలు ఇస్తానని,పోడు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తానని,తానే సొంతంగా కుర్చీ వేసుకుని పర్యవేక్షిస్తామని వాగ్దానం చేసాడు కానీ ఈ ఏడు సంవత్సరాలు లో సమస్యను గాలికి వదిలేసి హరితహారం పేరుతో అటవీ అధికారులను ప్రోత్సహించి పోడు సాగు దారులపై ముఖ్యంగా ఆదివాసీలు ఇతర పేదలపై దౌర్జన్యం చేస్తూ భూములు స్వాధీనం చేసుకుంటున్నారు.అడ్డు వచ్చిన వారిపై అక్రమ కేసులు బనాయించి జైలుపాలు చేస్తున్నారు అని అన్నారు. 

ఆదివాసీలకు అడవులు అటవీ భూములే జీవనాధారం వారి పోరాటాల ఫలితంగా 2006 అటవీ హక్కుల చట్టం వచ్చింది దీని ప్రకారం ప్రతి కుటుంబానికి 10 ఎకరాలకు పట్టాలు ఇవ్వాలి,కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నోసార్లు పేదలు దరఖాస్తులు పెట్టుకున్నప్పటికీ వాటిని పట్టించుకోవడం లేదని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టి డివిజన్ కార్యదర్శి అమర్లపూడి రాము,జిల్లా నాయకులు నూపా భాస్కర్,జి ప్రభాకర్,కె కల్లయ్య కల్లూరి కిషోర్, పోతుగంటి లక్ష్మణ్,డివిజన్ నాయకులు,కుంజా కృష్ణ,వాసం బుచ్చిరాజు,కారం సంద్య, నూపా సరోజని,పివైఎల్ నాయకులు కొర్సా రామకృష్ణ, కాక రాజు,వై రామారావు తదితరులు పాల్లొన్నారు.

Share it:

Post A Comment: