CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పేరుకు జూనియర్ అసిస్టెంట్- చేతలకు సీనియర్ గ్యాంబ్లర్ పేపర్లు లీక్ చేస్తా - ఉద్యోగాలు ఇప్పిస్తా

Share it:



మన్యం మనుగడ , మణుగూరు:



 సింగరేణిలో ఐటీఐ ఫిట్టర్‌ ట్రైనీ(ఎక్స్‌టర్నల్‌) రాతపరీక్షకు సంబంధించిన పేపర్‌ లీక్‌ చేసి ఉద్యోగాలు ఇప్పిస్తానని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియాకు చెందిన సింగరేణి ఉద్యోగి నిరుద్యోగుల నుంచి నగదు వసూళ్లకు పాల్పడిన విషయం శనివారం బయటకు పొక్కింది. మొత్తం 128 పోస్టులకు 2,681 మంది అభ్యర్థులు ఆదివారం రాత పరీక్షకు హాజరుకానున్నారు. కొండాపురం భూగర్భ గనిలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న హరినాథ్‌ రుషి.. పరీక్ష పేపరు లీక్‌ చేసి, ఉద్యోగాలు ఇప్పిస్తామని వసూళ్లకు పాల్పడినట్లు బాధితులు శనివారం సింగరేణి విజిలెన్స్‌ అధికారులకు చరవాణి ద్వారా సమాచారం ఇచ్చారు.

దీనికి సంబంధించిన వాయిస్‌ రికార్డులను అధికారులకు పంపించారు. దీనిపై విజిలెన్సు అధికారులు మణుగూరు ఏరియా అధికారులకు సమాచారం అందించగా విచారణ చేపట్టారు. తొలుత సింగరేణి భద్రతా అధికారికి, చెందిన హరినాథ్‌ రుషిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు ఒక్కొక్కరి వద్ద రూ.12 లక్షలకు బేరం కుదుర్చుకుని, అడ్వాన్స్‌గా రూ.50 వేలు తీసుకున్నట్లు సమాచారం.


గతంలో కూడా సింగరేణి ఉద్యోగాల విషయాల్లో అతనిపై ఆరోపణలున్నట్లు సమాచారం. దీనిపై సీఐ భానుప్రకాశ్‌ని '' వివరణ కోరగా ఫిర్యాదు అందిందని, ఈ వ్యవహారంపై విచారణ చేస్తున్నామన్నారు. బాధితులు ఇంకా ఎవరూ ముందుకు రాలేదని చెప్పారు.

Share it:

TELANGANA

Post A Comment: