CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అన్నపురెడ్డిపల్లి మండలంలో ప్రారంభమైన సంచార కోవిడ్ టీకా కార్యక్రమం 🚑

Share it:

 


👉 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాలనుసారం ప్రారంభమైన మొబైల్ కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం.

👉 సందర్శించిన డిప్యూటీ డిఎంహెచ్ఓ-డాక్టర్ పోటు వినోద్ మరియు జిల్లా సర్వే లైన్ అధికారి-డాక్టర్ చేతన్

మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి(ఆగస్టు 09):: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండలం,ఎర్రగుంట గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అబ్బుగూడెం గ్రామ ఆరోగ్య ఉప కేంద్రం పరిధిలోని బుచ్చన్నగూడెం గ్రామంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంచార కోవిడ్ టీకా కార్యక్రమంను స్థానిక గ్రామ సర్పంచ్ సడియం తిరుపతయ్య ప్రారంభించారు. మొబైల్ కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమంను డిప్యూటీ డిఎంహెచ్ఓ-డాక్టర్ పోటు వినోద్ మరియు జిల్లా సర్వే లైన్ అధికారి-డాక్టర్ చైతన్య సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ కార్యక్రమంలో గ్రామంలోని 89 మంది ప్రజలకు వ్యాక్సిన్ వేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈఓ-పోలేబోయిన కృష్ణయ్య, ఎంపిహెచ్ఏ(ఎఫ్)- జయ, లక్ష్మి, ఆశాలు-సునీత, కే మణి, సిహెచ్ లక్ష్మి కుమారి,గ్రామ పంచాయతీ సెక్రెటరీ బాలాజీ, అంగన్వాడి టీచర్లు, సిబ్బంది, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: