CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మణుగూరులో స్వీపింగ్ యంత్రాల ను ప్రారంభించిన ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా

Share it:

 



*జిహెచ్ఎంసి తరువాత మణుగూరు లోనే స్వీపింగ్ యంత్రాల పనులు


*రేగా కాంతారావు టిఆర్ఎస్ లోకి వచ్చాకే అభివృద్ధి కనబడుతుంది- నియోజకవర్గ ప్రజలు


మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మున్సిపాలిటీ, వార్తల్లోకెక్కింది.వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తరువాత స్వీపింగు యంత్రాలను ఉపయోగించబోయే ప్రాంతం మణుగూరు మున్సిపాలిటీ అని ప్రజలు చర్చించుకుంటున్నారు.మున్సిపల్ కమిషనర్ చేస్తున్న సేవలు,అభివృద్ధికి సహకరిస్తున్న పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు కృషితో,మంత్రి కేటీఆర్ మణుగూరు ప్రాంతానికి స్వీపింగ్ యంత్రాలను మంజూరు చేశారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు ప్రాంతము సింగరేణి గనుల తో నిండి ఉన్నందున, అభివృద్ధితో పాటు,కాలుష్య ప్రభావం ఎక్కువ కావడంతో 

మున్సిపాలిటీ ప్రజలు పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకపోవడంతో,తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ కమిషనర్ రహదారులను శుభ్రం చేయుటకు కాంట్రాక్టు కార్మికులను నియమించినప్పటికి,అనుకున్న స్థాయిలో పారిశుద్ధ్య పరంగా గమ్యాన్ని చేరుకోవడం లో అవాంతరాలు ఎదురవుతున్నాయి అని తెలుసుకున్న,ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా,వెంటనే స్పందించిన మంత్రి వెంటనే రూ.24 లక్షల వ్యయంతో మణుగూరు ప్రాంతానికి రెండు స్వీపింగ్ యంత్రాల ను,కేటాయించడం జరిగింది. శనివారం నాడు ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా చేతుల మీదుగా స్వీపింగ్ యంత్రాలను ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ,తెలంగాణ ప్రభుత్వం ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని,పరిష్కారం దిశగా అడుగులు వేస్తుందని,దానిలో భాగమే మణుగూరు మున్సిపాలిటీ కి రోడ్లను శుభ్రపరిచే యంత్రాలను తీసుకురావడం అని అన్నారు.అడిగిన వెంటనే స్వీపింగ్ యంత్రాలను మంజూరు చేసిన మంత్రి కేటీఆర్ కు విప్ రేగా కాంతారావు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం సందర్భంగా మున్సిపల్ కమిషనర్,సిబ్బంది విప్ రేగా కు ఫొటో ఫ్రేమ్ ను విప్ రేగా కు బహుకరించారు.విప్ రేగా కాంతారావు కృషి తోనే పినపాక నియోజకవర్గం లో అభివృద్ధి సాధ్యమవుతుందని,ఇంతకు ముందు నియోజకవర్గాన్ని పాలించిన నేతలు,స్వలాభాల కోసమే పనిచేసి చేతులు దులుపుకున్నారని,నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా,డీసీసీబీ డైరెక్టర్ తుళ్ళూరి. బ్రహ్మయ్య,ఎంపీపీ కారం. విజయకుమారి,జడ్పీటీసి పొశం.నర్సింహారావు,మున్సిపల్ కమిషనర్ నాగ ప్రసాద్, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,మండల ప్రజా ప్రతినిధులు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి నవీన్, మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్,మండల,పట్టణ యువజన అధ్యక్షులు హర్షవర్ధన్,రుద్ర వెంకట్, సోషల్ మీడియా ఇంచార్జి శ్యామ్ సుందర్,పట్టణ ప్రముఖులు దోసపాటి. వెంకటేశ్వరరావు,దండా. రాధాకృష్ణ టిఆర్ఎస్ పార్టీ నాయకులు,రాంబాబు, కృష్ణ,శ్రీను,లక్ష్మయ్య,గణేష్,హరిప్రసాద్,బాబీజన్,మహిళ కార్యకర్తలు,యువజన నాయకులు,బొశెట్టి.రవి ప్రసాద్,రామకోటి,తాత రమణ,సృజన్,తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: