CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కోవిడ్ సెంటర్లో పని చేసిన వర్కర్ల జీతాలు చెల్లించకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం: మణుగూరు అఖిలపక్ష పార్టీలు

Share it:

 



మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు కోవిడ్ సెంటర్లో పని చేసిన వర్కర్ల జీతాలు వెంటనే చెల్లించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని మణుగూరు అఖిలపక్ష పార్టీల నాయకులు హెచ్చరించారు. కొవిడ్ సెంటర్ లో పనిచేస్తున్న వర్కర్ల జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ,ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. రెండో రోజు దీక్ష శిబిరాన్ని మణుగూరు అఖిలపక్ష పార్టీల నాయకులు వట్టం. నారాయణ,వాసిరెడ్డి. చలపతిరావు,తెలుగుదేశం, ఆర్.మధుసూదన్ రెడ్డి, ఎండీ.గౌస్,సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ,పున్నం.బిక్షపతి,లింగంపల్లి.రమేష్,బి.జె.పి,గద్దల.శ్రీను,గొడిశాల. రాములు,సీపీఎం,అక్కి.నరసింహారావు,రావులపల్లి. రామ్మూర్తి,సీపీఐ,నవీన్,గోపి,కాంగ్రెస్ తదితరులు దీక్షా శిబిరాన్ని సందర్శించి,తమ సంపూర్ణ మద్దతు ప్రకటించి, మాట్లాడారు.అనంతరం అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యం లో వర్కర్ల జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్, చేస్తూ తహశీల్దార్ చంద్ర శేఖర్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ కరోనా సమయం లో సొంత కుటుంబ సభ్యులే కరోనా సోకిన సభ్యుల దగ్గరికి రావడానికి భయపడుతున్న తరుణంలో,తమ ప్రాణాలను పణంగా పెట్టి,కోవిడ్ సెంటర్లో విధులు నిర్వహించిన వర్కర్లకు ఏప్రిల్ నెల నుండి వేతనాలు చెల్లించకపోవడం దారుణమన్నారు.పని చేయించుకునే సమయంలో అధికార జులుం ప్రదర్శించిన అధికారులు,వేతనాలు చెల్లింపు విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. అధికారులు నాలుగు నెలల వేతనాలు తీసుకోకుండా ఎవరైనా పని చేస్తున్నారా అని ప్రశ్నించారు.కరోనా నివారణకు కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నామని చెబుతున్న ప్రభుత్వం,వర్కర్ల జీతాల చెల్లింపు విషయంలో ఎందుకు నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు.ఇప్పటికైనా ప్రభుత్వం మరియు ఉన్నత అధికారులు జోక్యం చేసుకుని,కోవిడ్ సెంటర్లో పని చేసిన వర్కర్ల జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.వర్కర్ల జీతాలు వెంటనే చెల్లించకపొతే అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నరసింహారావు,మునిగల శివ,ప్రశాంత్,శ్రీను తదితరులు పాల్గొన్నారు. రెండవ రోజు దీక్షలో వర్కర్లు రాణి,మంగమ్మ,భారతమ్మ, జయమ్మ,శైలజ,రాంబాయి, జానకి,మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: