CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా జరుపుదాం

Share it:

 



పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ


మన్యం మనుగడ, పినపాక: 


ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని పినపాక మండలంలో ఘనంగా వేడుకలు నిర్వహించుకోవాలని, మండలంలోని ఆదివాసీ సోదరులందరూ ఆత్మీయంగా కలుసుకొని ఆదివాసి దినోత్సవాన్ని జయప్రదం చేయాలని, పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ పిలుపునిచ్చారు. పినపాక మండలం లోని గడ్డంపల్లి గ్రామంలో పినపాక మండల ఆదివాసి ఐక్యవేదిక అధ్యక్షుడు తోలెం శ్రీను ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీపీ గుమ్మడి గాంధీ మాట్లాడుతూ, ఆగస్టు 9న జరిగే ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా మండలంలోని ఆదివాసి సోదరులందరూ, ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్ లో గల కొమరం భీం విగ్రహం వద్దకు రావాలని, అక్కడ జరిగే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు రానున్నారని, తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పినపాక మండల ఆదివాసి ప్రతినిధులు,ఉద్యోగులు, విద్యావంతులు, యువత, గ్రామస్తులు,ఆదివాసీ శ్రేయోభిలాషులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కాయం శేఖర్, గడ్డం పల్లి సర్పంచ్ సునీల్ కుమార్, ఆదివాసి ఉద్యోగ సంఘం డివిజన్ అధ్యక్షులు అనిల్ కుమార్,కన్వీనర్ సోలం అశోక్,వసంత్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: