మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి(ఆగస్టు 06):: అన్నపురెడ్డిపల్లి మండలంలోని అన్ని అంగన్వాడి సెంటర్లో నిర్వహిస్తున్న తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాడు మహబూబునగర్ గ్రామంలోని అంగన్ వాడి సెంటర్లో, అంగన్వాడి సూపర్వైజర్ గంగాజలం ఆధ్వర్యంలో మదర్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశాల్లో గర్భిణీ మహిళలకు, బాలింత మహిళలకు తీసుకోవాల్సిన పోషకాహారం మరియు శరీర దృఢత్వం కొరకు తీసుకోవలసిన ఐరన్ టాబ్లెట్స్ గురించి, ముఖ్యంగా గర్భిణీ మహిళలకు బిడ్డ పుట్టగానే గంటల లోపు పట్టించవల్సిన ముర్రిపాలు ఆవశ్యకత, పిల్లల్లో వృద్ధిచెందే వ్యాధి నిరోధక శక్తి గురించి అంగన్వాడి సూపర్వైజర్ గంగాజలం వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్-వాణి, అంగన్వాడీ ఆయా-పద్మ, తదితరులు ఉన్నారు.
Post A Comment: