CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు సాగు దారులకు అన్యాయం చేస్తే సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదు

Share it:


👉 దళితులకు దళిత బంధు పథకంతో పాటు గిరిజనులకు గిరిజన బంధు కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్.

మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి(ఆగస్టు 04)::అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని జానికిపురం గ్రామంలో బుధవారం నాడు లింగపోయిన వెంకటేశ్వర్లు అధ్యక్షతన సిపిఎం పార్టీ జెండా ఆవిష్కరణ చేసి, సిపిఎం పార్టీ ద్వితీయ మహాసభ నిర్వహించడం జరిగింది. ఈ మహాసభలో సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఎన్నికల సమయంలో దళితులకు మాత్రమే దళిత బందును ప్రకటించటం కాకుండా గిరిజనులకు గిరిజన బంధువును కూడా ప్రకటించాలనీ డిమాండ్ చేశారు.కోవిడ్ ప్రమాదం పట్ల ప్రభుత్వాలు అప్రమత్తంగా లేవని, అనేక దశాబ్దాలుగా పేద రైతులు పోడు భూమి సాగు చేసుకుంటున్నారని, వారి పట్ల ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా జెసిబిలతో  రైతులు భూమిని స్ట్రెంచ్ కోట్టి, సాగుదారులు అందరని భూమి నుంచి వెళ్లగొట్టాలని చూస్తున్నారని. సాగు చేసుకుంటున్న పోడు రైతుల పై నిర్బంధాలు ప్రయోగించి తనకున్న ఫారెస్ట్ ,పోలీసు బలగాలతో భయబ్రాంతులకు గురి చేస్తూ పోడు భూములు స్వాధీనం చేసుకోవాలనే ఆలోచన చేస్తున్నారని. మరోపక్క ముఖ్యమంత్రికి కేసీఆర్ ఈ సమస్యను పరిష్కరిస్తామని ,     స్టాట్స్కో  పెడతామని అని చెప్పినాడని.కెసిఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు పోడు సాగుదారుల అందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని, అలా కాకుండా ప్రజలను పోడు భూముల నుంచి వెళ్ళ కొట్టాలని చూస్తే, సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటి సభ్యులు కొండపల్లి శ్రీధర్ ,సీపీఎం పార్టీ పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల కార్యదర్శి జంగిలి వెంకటరత్నం,నాయకులు ఎన్ కోటయ్య, ఎల్ వెంకన్న ,కే కృష్ణ, కే బాబురావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: