CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మంత్రులతో కలిసి రామప్ప దేవాలయం శ్రీ రామలింగేశ్వర స్వామి నీ దర్శించుకున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క

Share it:

 


 రామప్ప కు కు యునెస్కో గుర్తింపు రావడం వువారసత్వ సంపదకు దక్కిన అరుదైన గౌరవం.

యునెస్కో గుర్తింపు కోసం కృషి చేసిన పాండురంగారావు మరియు పాపారావు గారికి సహకరించిన భారత ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ధన్యవాదాలు.ములుగు ఎమ్మెల్యే సీతక్క.

మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లోని పాలంపేట గ్రామంలో రామప్ప దేవాలయం లో మంత్రుల తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క 

ఈ సందర్భంగా మాట్లాడుతూ రామప్ప రుద్రేశ్వర ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు రావడం ఏళ్ల నిరీక్షణకు యునెస్కో శుభ ముగింపు పలికింది అని  సర్వాంగసుందరంగా ముస్తాబైన రామప్ప అంతర్జాతీయ పర్యాటక ముఖచిత్రంలో స్థానం పొందింది అని  వరల్డ్ హెరిటేజ్ కమిటీ (యునెస్కో ) భేటీ అయ్యి రామప్పకు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించి 

శిల్పకళాఖండాలకు నిలయమైన రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. వారసత్వ కట్టడాల ప్రత్యేకతలను పరిశీలించేందుకు.చైనా, ప్యారిస్​లు వేదికగా సమావేశమైన ప్రపంచ హెరిటేజ్ కమిటీ ప్రతినిధులంతా రామప్ప ను  ప్రపంచ పర్యాటకులు చూడదగ్గ ప్రదేశంగా భావించడం సంతోషకరం అని 21 దేశాలు రామప్ప ప్రపంచ వ్యాప్తంగా 42 వారసత్వ కట్టడాలు యూనెస్కో పరిశీలనకు ఎంపికవగా మన దేశం నుంచి 2020 సంవత్సరానికి రామప్పకు మాత్రమే ఈ ఖ్యాతి దక్కింది అని  రామప్ప ఆలయం శిల్పకళా సంపదకు కేంద్రం అని కాకతీయ చక్రవర్తి  రేచర్ల రుద్రుడు హయంలో 1213లో నిర్మితమై.. మహా శిల్పి రామప్ప కళా నైపుణ్యంతో అద్భుతంగా,అపురూపంగా చరిత్రలోనిలిచిపోయింది.

అలాంటి ఈ అద్భుత ఆలయానికి నేడు అపురూప గుర్తింపు లభించింది అని సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి,ఇరుస వడ్ల వెంకన్న,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్,ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య,మండల అధ్యక్షులు చెన్నొజుసూర్యనారాయణ,ఎండీ చాంద్ పాషా,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్,కొత్త గూడ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు సుంకర బోయిన మొగిలి,ఎంపీపీ విజయ రూపు సింగ్,ఎంపీటీసీలు బానోత్ భాస్కర్,మవురపూ తిరుపతి రెడ్డి,సదయ్య,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు మట్టే వాడ తిరుపతి,మూషిన పెల్లి కుమార్ గౌడ్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కుక్కల నాగరాజు

సర్పంచులు మాడ ప్రకాష్, తుమ్మేటి రాజీ రెడ్డి,పముకుంట్ల బద్రయ్య,కొయ్యల విజయ బద్రయ్యా,గ్రామ కమిటీ అధ్యక్షులునాగరాజు,సుధాకర్,కట్ల రాజు,నర్సయ్య,సుమన్ రెడ్డి,గౌతమ్ కుమార్,జక్కుల రేవంత్ యాదవ్ పెద్ది నర్సింహా రావు,ఉప సర్పంచ్ మర్క జయశంకర్,సహకార సంఘం వైస్ చైర్మన్ రాజేందర్,రవి,గోపాల్ వార్డు సభ్యులు పద్మయ్య,స్వామి

బండి రజినీకార్,సంజీవ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: