CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మంగపేట మండలం లో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు

Share it:

 


మన్యం టీవీ మంగపేట.


మంగపేట మండల కేంద్రంలో సోమవారం నాడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు  ఘనంగా నిర్వహించరు.ఇట్టి కార్యక్రమనికి బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ పాల్గొని మాట్లా డుతూ ఆదివాసీలు అడవులు నమ్ముకొని జీవనాన్ని కొనసాగిస్తు పూర్వము నుండి సాగులో ఉండి పంటలు చేస్తూ వాటిపై ఆధారపడి జీవనాన్ని గడుపుతున్నారని అన్నారు. అట్టి సాగుభూములపై తెరాస ప్రభుత్వం ఆదివాసీల సాగుభూములపై ఫారెస్ట్ అధికారులను ఉసిగొల్పుతూ కేసీఆర్ పాశవికంగా ఆనందం పొందుతూన్న విషయాన్ని ఆదివాసీ సమాజం గమనిస్తున్నదని వారు అన్నారు.  ఆదివాసీలు ఏండ్ల తరబడి సాగులో ఉన్న భూములను కాపాడుకోవడానికి ఆదివాసీల ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉవ్వెత్తున కెరటాల వలె ఎగిసిపడి మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాడుతామన్నారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ మేల్కొని ఆదివాసుల సాగుభూములపై ఫారెస్ట్ అధికారుల దాడులను నిలిపివేయాలని ఆదివాసీలు భూములను సాగు చేసుకునెలా స్వేచ్ఛ కల్పించే దిశగా ఉండాలని  ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోఆదివాసీ యువత,తుడుండెబ్బ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: