CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

డి సి వో ని. సస్పెండ్ చేయాలి

Share it:

 


*తుడుం దెబ్బ ములుగు డివిజన్ ప్రధాన కార్యదర్శి కాపుల సమ్మయ్య.

మన్యం టీవీ ఏటూరు నాగారం

ఇసుక దళారులతో కుమ్మక్కై ఆదివాసీల ఆర్థిక ప్రయోజనాలను దెబ్బ తీస్తున్న ములుగు జిల్లా డి సి ఓ విజయ్ భాస్కర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని తుడుందెబ్బ ములుగు డివిజన్ ప్రధాన కార్యదర్శి కాపుల సమ్మయ్య డిమాండ్ చేశారు.ములుగు జిల్లా పరిధిలోని వాజేడు మండలం అయ్య వారి పేట గ్రామంనకు చెందిన ఇసుక సొసైటీలో నిబంధనలకు విరుద్ధంగా స్థానికేతరులను మరియు ప్రక్క రాష్ట్రం వారితో తో ఇసుక సొసైటీని ఏర్పాటు చేసి ఇసుక దళారుల నుంచి లక్షల రూపాయల లంచం తీసుకుని ఆదివాసీల ఆర్థిక ప్రయోజనాలను వారి హక్కులను కాలరాస్తున్నారని సమ్మయ్య ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసి గ్రామాలలో ఇసుక దళారులను ప్రోత్సహిస్తూ ఆదివాసీలు సొంతంగా సొసైటీలు చేసుకోకుండా అడ్డుకుంటున్నారని అందులో భాగంగానే పేరూరు గ్రామం నుంచి ఒకరు భద్రాచలం నుంచి ఇద్దరు చత్తీస్గడ్ నుంచి ఇద్దరు మరియు ప్రభుత్వ ఉద్యోగులతో కమిటీ ఏర్పాటు చేసి ఆదివాసీలను ఆర్థికంగా నష్టపోయే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ గారు స్పందించి డి సి ఓ ను వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు.అట్లాగే సొసైటీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు చింత సోమ్ రాజ్ ,కణితి వెంకటకృష్ణ, జిల్లా కార్యదర్శి మడకం చిట్టిబాబు,కన్నాయిగూడెం మండల అధ్యక్షుడు పొడెం నరసింహారావు, మండల ప్రధాన కార్యదర్శి మల్కం సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: