CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు భూముల రక్షణకై పోరుయాత్ర ను జయప్రదం చేయండి.

Share it:

 



 మన్యం టివి,దమ్మపేట:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం

ఆదివాసీలు ఇతర పేదలు సాగుచేసుకుంటున్న పోడు భూములు అన్నింటికీ అటవీ హక్కుల చట్టం ప్రకారం 10 ఎకరాలకు పట్టాలు ఇవ్వాలని, పోడు భూముల్లో కందకాలు తవ్వడం హరితహారం పేరుతో మొక్కలు వేయడాన్ని ఆపేయాలని, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ అఖిల భారత రైతు కూలీ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 5వ తారీఖు నుండి అశ్వరావుపేట నుండి ప్రారంభమవుతున్న పోడు సాగు దారుల పాదయాత్రను విజయవంతం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ దమ్మపేట మండల కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం చిల్లగుంపు  గ్రామంలో నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశంలో పాలవంచ డివిజన్ కమిటీ కార్యదర్శి అమర్లపూడి రాము మాట్లాడుతూ ఆదివాసీలు చేసిన సుదీర్ఘ పోరాటాల వలన 2006లో అటవీ హక్కుల చట్టం వచ్చిందని, దీని ప్రకారం ప్రతి ఆదివాసి కుటుంబానికి 10 ఎకరాలకు హక్కు కల్పించాలని అన్నారు.

కానీ కేసీఆర్ ప్రభుత్వం హరితహారం పేరుతో టి ఎన్నో సంవత్సరాల నుండి ఆదివాసీలు, పేదలు సాగు చేసుకుంటున్న భూములు లో అడవులు పెంచాలనే పేరిట ఆదివాసుల పైన అటవీ అధికారులు దాడులు, దౌర్జన్యాలు నిర్వహిస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ జై లకు  పంపుతున్నారని అన్నారు. ఆదివాసీలకు 3 ఎకరాల భూమి ఇస్తామని కేసీఆర్ హామీనీ  వెంటనే అమలు చేయాలని అడవుల రక్షణ పెంపుకు ఆదివాసీలపై దౌర్జన్య ఆపి పలువురు నిపుణులు చేసిన సిఫారసులను అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తోడమo దుర్గమ్మ ,సంధ్య, వెంకటేష్, ముత్యాలరావు, నాగేష్, తాటి సత్యం, రాము, నాగరాజు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: