CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యకు ఐటీడీఏ పీవోగా అదనపు బాధ్యతలు

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరు నాగారం ఐటీడీఏ కార్యాలయంలో శనివారం అన్ని శాఖల ఉద్యోగులతో కలెక్టర్ సమీక్ష సమావేశం విధులకు హాజరు కాని ఆర్ఓఎఫ్ఆర్ సెక్షన్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రెండు రోజుల వేతనం నిలిపివేత,మెమో జారీ చేశారు.అన్ని శాఖల ఉద్యోగులందరూ హెడ్ క్వార్టర్స్ లోనే ఉండాలని ఆదేశం విధులకు సక్రమంగా హాజరు కాకపోతే శాలరీస్ కట్ చేస్తామనిహెచ్చరిక.ఉద్యోగులందరూ ములుగు వెలుగు ఆప్ ద్వారానే హాజరు వేయాలని తెలిపిన కలెక్టర్ అన్ని శాఖల డిప్యుటేషన్లు రద్దు చేస్తూ నిర్ణయించారు.అన్ని శాఖల ఆస్తుల వివరాలను గుర్తించి ఈడి ఆఫీసుకు అందించాలన్నారు.ఫైల్స్ మాన్యువల్ కాకుండా ఆన్లైన్లో పొందుపరచాలని అన్ని శాఖాధిపతులకు ఆదేశించారు.

నిరుపయోగంగా ఉన్న ఐటీడీఏ ఆధ్వర్యంలోని గార్డెన్ ను రీ ఓపెన్ చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.అనంతరం ఐటీడీఏ ఆఫీస్ లోని పలు విభాగాల ఛాంబర్ లను తనిఖీ చేసి రికార్డ్ రూమ్ లో శాఖల వారీగా ఫైల్స్ ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా ఐటీడీఏ భవనం పైకప్పును పరిశీలించారు. కార్యాలయం చుట్టూ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని పిచ్చి మొక్కలు తీసి శుభ్రంగా ఉండేలా చూడాలని ట్రైబల్ వెల్ఫేర్ డిడి ఎర్రయ్య కు సూచించారు.ఈ కార్యక్రమంలో ఏపీఓ వసంతరావు,ట్రైబల్ వెల్ఫేర్ డిడి ఎర్రయ్య,ఏవో రఘు,ఎస్ ఓ రాజ్ కుమార్,ఐటిడిఎ టిడిఎంహెచ్ ఓ వెంకటేశ్వర్లు, జిసిసి డిఎం ప్రతాప్ రెడ్డి,ఆర్ సి ఓ రాజ్యలక్ష్మి,పిఏఓ లక్ష్మీ ప్రసన్న,ఐటిడిఎ మేనేజర్ 

లాల్ నాయక్,సంబంధిత శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

Post A Comment: