CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్‌ జయంతి:ఎంపీపీ రేగా కాళిక

Share it:



తెలంగాణ సిద్ధాంతకర్త,ఉద్యమ స్ఫూర్తి ప్రధాతగా తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 86వ జయంతి కరకగూడెం మండల అభివృద్ధి కార్యాలయం నందు ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి కరకగూడెం మండల ఎంపీపీ రేగా కాళిక చేతులమీదుగా పూలమలలు వేసి ఘన నివాళులర్పించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.... ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న‌ కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన నిరంతర కృషిని,ఆయ‌న ధృడ సంక‌ల్పాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరువలేరు అని అన్నారు.తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ గుర్తిండిపోయే వ్యక్తి జయశంకర్ సార్ ఉద్యమకారుడి నుండి మహోపాధ్యాయుడి దాకా ఆయన తెలంగాణకు దిక్సూచిగా నిలిచారని ఆమె తెలిపారు. 

ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి ఆధికారి డి శ్రీను,కరకగూడెం ఎంపిటిసి యలిపెద్ది శైలజ,టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రావుల సోమయ్య,భూర్గంపహడ్ వ్యవసాయ కమిటి ఉపాధ్యక్షులు కొమరం రాంబాబు,కరకగూడెం గ్రామ కమిటి అధ్యక్షులు చిట్టి సతీష్,కరకగూడెం ఉప సర్పంచ్ రావుల రవి,పోగు వెంకటేశ్వర్లు,బుడగం రాము,రేగా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: