CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ని విమర్శించే అర్హత మీకు లేదు.

Share it:

 


టిపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గతంలో ఏ పార్టీ కి చెందిన వాడో ఒక్క సారి కాంగ్రెస్ పార్టీ నాయకులు అత్మ పరిశీలనచేసుకోండి

మన్యం టీవీ కరకగూడెం: పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మా నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ని విమర్శించే అర్హత మీకు లేదని టిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు బొడ్డు నెహ్రూ, చిట్టిమళ్ళ ప్రవిన్ అన్నారు. వారు టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎర్పాటు చేసిన విలెకర్ల సమావేశంలో మాట్లాడుతూ పినపాక నియోజక వర్గంలో ఏ ఎమ్మెల్యే చెయ్యని అభివృద్దికి బాటలు వేస్తు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుంటే అధిచూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు రేగా కాంతారావు ని విమర్శించడానికి వారికి సిగ్గు అనిపించడం లేదా అని వారు అన్నారు.ఎక్కడో ఉన్న మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి వచ్చి మీ ప్రాంతాని,మీ గ్రామలను అభివృద్ధి చెయ్యడు అన్నారు.పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోనే మీకు మీకు ఐక్యత లేకా ఏ వర్గంలో ఏ నాయకునితో కలిసి పని చేయాలో తెలియని మీరు రేగాను విమర్శించడం సిగ్గు లేదా అన్నారు. అలాగే మీ టిపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి టిడిపి పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ లో చేరాలేదా అలాంటప్పుడు మా నాయకులు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు పార్టీ మారుతే తప్పెంటని వారు అన్నారు.రాజకీయ విలువలు తెలియని మీరు తప్పుడు ప్రచారాలు చేసే మీరు బాల్యం నుండి రాజకీయాలలో అనుభవం ఉన్న వ్యక్తిగా ప్రజలకు సేవ చెయ్యాలని సంకల్పతో ఉపాధ్యాయ వృత్తిని వదిలి గ్రామలను,పల్లెలను అభివృద్ధి చేస్తుంటే అది చూసి వార్వలేక మీ స్థాయికి మించిన విమర్శలు చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తె తగిన బుద్ధి చెప్పక తప్పదు అన్నారు. ఈ కార్యక్రమంలో ఊకె నరేష్, మామిళ్ళ శ్రీకాంత్ పాల్గొన్నారు.

Share it:

Post A Comment: