CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పత్రికా విలేకరులను కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి

Share it:

 



ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఇచ్చే అన్ని అలవెన్సులు విలేకరులకు కూడా ఇవ్వాలి


విలేకరులకు ఇంటి స్థలాలు కేటాయించి డబల్ బెడ్ రూంలు కట్టించాలి

-కొంకతి సాంబశివరావు డిమాండ్.

మన్యం టీవీ మంగపేట.


విపత్కరపరిస్థితులలో కరోనా వారియర్స్ గా నిలిచి ఎప్పటి కప్పుడు కరోనా సమాచారంను ప్రజలకు అధికారులు ప్రజా ప్రతినిధులు చేర వేసేందుకు నిరంతరం కృషి చేసి విధి నిర్వహణలో కొంతమంది తమ ప్రాణాలను సైతం పనంగా పెట్టి కరోనా కట్టడికి తమ వంతు సహకారం అందించిన విలేకరులకు, ప్రభుత్వ కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఇచ్చే అన్ని రకాల అలవెన్సులు ఇవ్వాలి వాటితో పాటు ప్రభుత్వం ఇంటి స్థలాలు కేటాయించి డబుల్ బెడ్ రూమ్ కట్టించి ఇల్లు అందజేయాలని కాంగ్రెస్ పార్టీ మంగపేట మండలం ప్రధాన కార్యదర్శి కొంకతి సాంబశివరావు మంగళవారం నాడు పత్రిక ప్రకటన ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా కల్లోల సమయంలో ప్రపంచ దేశాలు సైతం వణికి పోతున్న తరుణంలో కరోనాను కట్టడి చేసేందుకు కరోనా వారియర్స్ గా జర్నలిస్టులు ప్రముఖ పాత్ర పోషించారు. అలాంటివిలేకరులను ప్రభుత్వం గుర్తించి మండల జిల్లా కేంద్రాలలో ప్రభుత్వ ఇంటి స్థలాలను డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు మంజూరు చేయాలని అన్నారు.ప్రభుత్వ పథకాల అమలుకు ఉన్న భూమి నిరంతరం ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా ఉన్న సమాచారంను అందిస్తున్న విలేకరులకు ఇంటి స్థలానికి ఇవ్వాడానికి లేదా అని ప్రశ్నించారు.ప్రభుత్వం జిల్లా అధికారులు వెంటనే విలేకరులకు ఇంటి స్థలాలను కేటాయించలని కాంగ్రెస్ పార్టీ మంగపేట మండలం ప్రధాన కార్యదర్శి కొంకతి సాంబ శివరావు అన్నారు.

Share it:

Post A Comment: