CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పెంట్లం గ్రామంలో ఏర్పాటుచేసిన మెగా వైద్య శిభిరం

Share it:

 


మన మీడియా ప్రతినిధి/ అన్నపురెడ్డిపల్లి:: సీజనల్ వ్యాధుల దృష్ట్యా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి (ఐఏఎస్) ఆదేశాలనుసారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు ప్రియాంక ఆధ్వర్యంలో పెంట్లం గ్రామ పంచాయతీ నందు మెగా వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిభిరాన్ని పెంట్లం గ్రామ పంచాయతీ సర్పంచ్ సవలం రాణి, ఎంపీటీసీ బొగ్గం సీతామహాలక్ష్మి లు ప్రారంభించారు. గ్రామ ప్రజలకు వైద్య బృందం ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, సంబంధిత వ్యాధులకు మందులను అందజేశారు. ఈ వైద్య శిభిరంలో కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం కూడా నిర్వహించారు. వైద్యురాలు ప్రియాంక ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు వర్షాకాలం సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ఇంటి పరిసరాల్లో దోమల నివారణకు నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన మంచి నీళ్లను త్రాగాలని, ప్రతి కుటుంబంలో వారు వ్యక్తిగత పరిశుభ్రతను, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని. జ్వరంతో బాధపడుతున్న వారు రక్త పూతల తీయించుకొని, జ్వరం నిర్ధారణ చేయించుకొని నివారణ మార్గాలైన చికిత్సలు పొందాలని. ప్రతి శుక్రవారం గ్రామాల్లో నిర్వహించే డ్రై డే-ఫ్రైడే కార్యక్రమంలో విధిగా అందరూ పాల్గొని, గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. ఈ వైద్య శిభిరం కార్యక్రమంలో వైద్య బృందం డిపిఎంఓ -ఐ వెంకటేశ్వరరావు, హెచ్ఈఓ-పోలేబోయిన కృష్ణయ్య, హెచ్వి-శారా రాణి,హెచ్ఏ(ఎమ్)-రామదాసు,హెచ్ఏ(ఎఫ్)లు - పొన్నారి,జ్యోతి, ఆశాలు-శిరోమణి,రాధ,ప్రియాంక,నాగమ్మ, అంగన్వాడీ టీచర్లు- బి అరుణ కుమారి,ఎమ్ పుష్ప, టి కృష్ణకుమారి, గ్రామ పంచాయతీ సెక్రెటరీ పి రమేష్ మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితర గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు ఉన్నారు.

Share it:

Post A Comment: