CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ. ఫసల్ బీమా పథకం అమలు చేయాలంటూ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సత్యాగ్రహం...

Share it:

 మన్యం టీవీ : జూలూరుపాడు, ఆగస్టు 11, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ చేయాలని,  పసల్ బీమా పథకం అమలు చేయాలని,   జూలూరుపాడు

తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఒకరోజు సత్యాగ్రహం చేపట్టారు.  ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తాహశీల్దార్ కార్యాలయల ఎదుట ఆందోళన చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు రుణమాఫీ చేయకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కెసిఆర్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఒకేసారి లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పడంతో రైతులు ఆనందపడ్డారని, కానీ రైతులను టిఆర్ఎస్ ప్రభుత్వం  మోసం చేసిందని అన్నారు. ఫసల్ బీమా పథకం అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తోందని అన్నారు. ఈ జిల్లాలో ఎక్కువగా పొడు వ్యవసాయం చేసుకుంటున్నారు, కానీ పోడు వ్యవసాయ రైతుల్ని టిఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలకు అడవి హక్కుల చట్టం తీసుకు వచ్చింది కానీ రాష్ట్ర ప్రభుత్వం దీనిని అమలు చేయకుండా రైతుల్ని రాష్ట్ర ప్రభుత్వ ఇబ్బందులకు గురి చేస్తుంది.  రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సమస్యలను పరిష్కరించే దాకా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, రైతాంగ సమస్యలను పరిష్కరించకపోతే, టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారని, కావున రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయం అని  కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ అన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కోశాధికారి నున్న రమేష్, బీజేపీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు  మోత్కూర్ నాగేశ్వరరావు,  బిజెపి మండల ప్రధాన కార్యదర్శి భూక్యా రాజేష్,  కిసాన్ మోర్చా మండల ఉపాధ్యక్షుడు కంచి సోమయ్య,  గోపాల్ రావు,  వజ్జ గోపి,  బచ్చల పుల్లయ్య,  ఇరప్ప వెంకటేశ్వర్లు,  నరసింహులు, లక్ష్మణ,  జస్ట్ నరేష్ కిరణం వందనపు సుబ్బు  రైతులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: