CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

టిఆర్ఎస్ జెండా పండుగ విజయవంతానికి పూర్తి స్థాయి ఇన్ఛార్జిల నియామకం

Share it:

 



పనిచేయని మండల, పట్టణ అధ్యక్షులను సైతం మార్పు 

పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే- రేగా


మన్యం మనుగడ డెస్క్:


తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాలతో సెప్టెంబర్ 2 వ తేదీ నుండి 12 తేదీ వరకు గ్రామ,వార్డు కమిటీలు పూర్తి చేయాలని తెలియజేశారు.దానికి అనుగుణంగా పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే కాంతారావు 2 వ తేదీ నియోజక వర్గ వ్యాప్తంగా జెండాపండగా చేయవవలసినదిగా ఆదేశించడం జరిగింది. అందుకు అనుగుణంగా సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం అన్ని గ్రామాలకు ఇంచార్జిలను నియమించడం జరిగినది. ఇన్ఛార్జిలు అందరూ వారి వారి మండలాలకు చెందిన అధ్యక్షుడు ఇచ్చిన సమయం ప్రకారం మండల కార్యాలయాల ముందు జెండా ఆవిష్కరించిన తరువాత, ఇన్చార్జి లకు కేటాయించిన గ్రామాలలో ఉదయం 11 గంటలకల్లా జెండాపండగ నిర్వహించి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలియజేశారు. ఈ సందర్భంగా రే కాంతారావు మాట్లాడుతూ, బాధ్యతలు తీసుకునే వ్యక్తి నీ నా అనే కంటి తారతమ్యం లేకుండా, ఎవరికైతే ఉంటుందో వారికి ఉంటుందని తెలియజేశారు. పని చేయని వారు ఎంతటి వారైనా, పక్కకు పెట్టె అవకాశం ఉందని హెచ్చరించారు. పార్టీ ఆదేశాలను పాటించని గ్రామకమిటి అధ్యక్షులను తొలగించి కొత్తవారి ఎంపిక పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు కూడా టిఆర్ఎస్ పార్టీ కి రథసారధి లైన కెసిఆర్, కేటీఆర్ నాయకత్వంలో పని చేసి పార్టీ పురోభివృద్ధికి తోడ్పడాలని తెలియజేశారు. పార్టీ కార్యకర్తల తో సమావేశం పెట్టి, వారి అభిప్రాయం తీసుకొని గ్రామకమిటి అధ్యక్షుని నిర్ణయించండి లేని యెడల అటువంటి ఎంపిక చెల్లదు అని తెలియజేశారు. ఈ సందర్భంగా, పార్టీ బలోపేతానికి కృషి చేసేందుకు నియోజకవర్గ పూర్తి స్థాయి ఇన్ఛార్జిలుగా 1.తుళ్లూరు,బ్రహ్మయ్య ,2.పటేల్.భద్రయ్య 3.పొశం.నర్సింహారావు 4.బొలిశెట్టి.నర్సింహారావు 

5.వట్టం.రాంబాబు 

6.ప్రభుదాసు లను నియమించారు. పార్టీ అధ్యక్షునితో కలిసి ఎంపీపీ, జడ్పిటిసి లు వారికి కి కి కేటాయించిన గ్రామాలతో పాటు 10 రోజుల పాటు సాధ్యమైనన్ని గ్రామాల్లో పర్యటించాలని తెలియజేశారు. 12వ తేదీ తర్వాత మండల,పట్టణ అధ్యక్షుల ఎంపిక,అనుబంధ సంఘాల ఎంపిక ఉంటుందని, పని చేసే వారికి ప్రాధాన్యత ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. స్వార్థం లేకుండా 100 శాతం, పార్టీ బలోపేతానికి కృషి చేసేవారికి ప్రాధాన్యత ఉంటుందని, తెలియజేయడం జరిగింది. నియోజకవర్గ పరంగా పనితనం చూపు కున్న వారికి జిల్లా అధ్యక్ష పదవి వచ్చే అవకాశం ఉందని సవాల్ విసిరారు.పని చేయని మండల పట్టణ అధ్యక్షులు ను సైతం మార్పు చేసే అవకాశం ఉంటుందని ఈ విషయాన్ని గమనించి నడుచుకోవాలని హెచ్చరించారు.కమిటీల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకొని చేయాలని తెలియజేశారు. అన్ని కమిటీలలో 51% ఎస్సీ, ఎస్ టి, బిసి, మైనారిటీ వర్గాలకు చెందిన నాయకులు ఉండాలని, ఆ విధంగా లేని కమిటీలను రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించడం జరిగింది.

Share it:

Post A Comment: