CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలి

Share it:

 


*అర్హులైన విద్యార్థులకు వ్యాక్సిన్ అందించి,దశల వారీగా విద్య సంస్థలు ప్రారంభించాలి.

*పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్,ఫీజురియాంబర్స్ మెంట్ విడుదల చేయాలి.

మన్యం టీవీ ఏటూరు నాగారం 

ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏటూరునాగారం తహసిల్దార్ ముందు ధర్నా అనంతరం తాసిల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన సంఘం నాయకులు,తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి   తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ,కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షుడు తోకల రవి,మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య,ఉపాధి కల్పనలో ఘోర వైఫల్యం చెందాయనీ,విద్యా,ఉపాధి కల్పనకై యువజన,విద్యార్థి సంఘాల నేతృత్వంలో ఆగస్టు తొమ్మిది నుండి ఇరవై వరకు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ఫ్రైవేట్ శక్తులకు అప్పగించి దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు.

విద్యారంగాన్ని పూర్తిగా ప్రైవేటుపరం చేస్తూ కార్పోరేట్ శక్తులతో కుమ్మక్కై విద్యావ్యాపారానికి  పాల్పడుతున్నారన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని,విద్యా వ్యవస్థలో కేంద్రీకృత విద్య విధానాలను ప్రోత్సహిస్తున్న నూతన విద్యా ముసాయిదా అమలును తక్షణమే ఆపాలని,ఫాసిస్ట్ భావజాల వ్యాప్తిని అడ్డుకోవాలని కోరారు.నూతన విద్యా ముసాయిదాలో తీసుకొచ్చిన సంస్కరణలు విద్యార్థులకు ఏవిధంగానూ ఉపయోగపడవు అని అన్నారు.పిజి,పి హెచ్ డి లు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉపాధి దొరకక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు.రోజు రోజుకు నిరుద్యోగ సమస్య రెట్టింపు అవుతుందని కరోనా కారణంగా అనేక లక్షల మంది ఉపాధి కోల్పోయారని అన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి విద్య,ఉపాధి రంగంలో ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని,అందరికీ చదువు,అందరికీ ఉపాధి కల్పించాలని కోరారు. రాష్ట్రంలోని వివిధ శాఖలు ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.రాష్ట్రంలోని వివిధ శాఖల్లో తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి.నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేంతవరకు నిరుద్యోగ భృతి చెల్లించాలి. ఆత్మహత్య చేసుకున్న ఇరవై ఏడు మంది నిరుపేద కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి.కార్పొరేట్,ప్రైవేటు విద్యాసంస్థలలో ఫీజులను నియంత్రించాలి.ప్రభుత్వ విద్యను పరిరక్షించాలి. రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న ఉద్యోగాలపై శ్వేత పత్రం విడుదల చేయాలి.ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో దోపిడీ అరికట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.పైన పేర్కొన్న విద్య,ఉపాధి సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా ఉపాధ్యక్షుడు అంకానీ వీర్రాజు,మారా వంశీ,శ్రీరామ్, భూపతిరాజు,వంశీ,యుగేందర్ స్వామి,నరేష్ ,రాజు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: