CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మండలకేంద్రం లో బస్ స్టాండ్ లేక ప్రయాణికుల అవస్థలు

Share it:

 


మన్యం టీవీ మంగపేట.


ములుగు జిల్లా మంగపేట మండలంలో బస్ స్టాండ్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదివరకు బస్ స్టాండు కట్టడానికి స్థలం లేక ఇబ్బందులు పడ్డాం ఇప్పుడు బస్ స్టాండుకు స్థలం ఉండి ఇబ్బందులు పడవలసి వస్తుంది ఎంపీడీఓ ఆఫీస్ ప్రక్కన కేటాయించిన బస్ స్టాండ్ స్థలాన్ని వెంట్టనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగపేటలో బస్ స్టాండ్ కట్టాలని ఎమ్మార్పీస్ మండల ఇంచార్జి గుగ్గిళ్ల సురేష్ ఈ సందర్బంగా డిమాండ్ చేసారు.బస్ స్టాండ్ కడుతామని స్థలాన్ని సేకరించి 6 సంవత్సరాలనుండి కడతామనే చెబుతున్నారు కానీ ఇంత వరకు కట్టింది లేదు అసలు ఒక ప్రాధాన్యత కలిగిన మండల కేంద్రానికి ఇంత వరకు బస్ స్టాండ్ కు దిక్కు లేదంటే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు ఏమి జేస్తున్నట్లు ఏ మొహం పెట్టుకొని ప్రజలకు అది చేసాం ఇది జేశాం అని చెప్తున్నారు. మంగపేట మండలంలో సరైన బస్ స్టాండ్ లేదు మంగపేట మండలానికి చుట్టూ ప్రక్కల నుండి వచ్చే ప్రయాణికులు వర్షంలో తడుస్తూ ఎండలు కొడితే బస్ ల కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు ఎండలో నిలబడి బస్ కోసం ఎదురు చూడడం అవుతుంది. ఇగనైనా ప్రభుత్వం, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర ఉన్న బస్ స్టాండ్ స్థలంలో బస్టాండ్ నిర్మాణం చేపట్టాలని మంగపేట ప్రజల కోరిక.

Share it:

Post A Comment: