CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా జిల్లా జడ్పీ కార్యాలయం లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్తు కార్యాలయంలో ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్తు వైస్ చైర్ పర్సన్ బడే నాగ జ్యోతి,ములుగు జడ్పీటీసీ సకినాల భవాని,వెంకటాపూర్ జడ్పీటీసీ గై రుద్రమదేవి తో కలసి జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా  జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.మహనీయులు మహాత్మా గాంధీ,డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ గారి సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. వారికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తరువాత రైతు బంధు,రైతు బీమా,కల్యాణ లక్ష్మీ,షాద్ ముబారక్,ప్రతి పేద కుటుంబానికి ఆహర భద్రత కార్డ్,మిషన్ భగీరథ,అనేక రకాలుగా పథకాలను ప్రవేశపెట్టినారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం రైతు అన్నలకు భరోసా నిచ్చింది.ములుగు జిల్లాలో అతి త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ పొడు రైతులకు పట్టాలు ఇస్తారని తెలిపారు.ప్రతి ఎకరానికి సాగు నీటిని అందిస్తాం అని అన్నారు.రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో దళిత బంధు కార్యక్రమం అమలు అవుతుంది అని అన్నారు.

ఈ కార్యక్రమంలో రైతు బంధు జిల్లా అధ్యక్షులు పల్లా బుచ్చయ్య,జడ్పీ సీఈఓ ప్రసూన రాణి,జిల్లా కోప్షన్ రియాజ్ మీర్జా,ఎంపీపీ బుర్ర రజిత సమ్మయ్య,జిల్లా ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షులు పోరిక విజయ్ రాం నాయక్,పోరిక గోవింద్ నాయక్,తాహిర్ పాషా,దళిత సేవ సమితి జిల్లా అధ్యక్షులు బొచ్చు సమ్మయ్య,మండల అధ్యక్షులు బాదం ప్రవీణ్,మురహరి భిక్షపతి, కూరేళ్ల రమాచారి,టౌన్ అధ్యక్షులు మెరుగు సంతోష్,

వేల్పురి సత్యనారాయణ,

మంద రవి,వేల్పుల రాజబాబు,శీలం మధు,ఉట్ల మోహన్,బానోత్ వెంకన్న,జడ్పీ సూపరిండెంట్ జడ్పీ సీసీ వినిత్,కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: