CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పాఠశాలలను,ప్రాథమిక వైద్యశాలను పరిశీలించిన ఎమ్మెల్యే

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

సెప్టెంబర్ ఒకటి నుండి పాఠశాలలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల కేంద్రంలోని ముప్పనపల్లి జిల్లా పరిషత్ పాఠశాల గురేవుల గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల, ప్రాథమిక పాఠశాల మరియు చింత గూడెం గ్రామం లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ను శుక్రవారం ఎమ్మెల్యే సీతక్క పరిశీలించారు.ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ సెప్టెంబరు ఒకటో తారీకు నుండి పాఠశాలలు ప్రారంభం అవుతున్న విద్యార్థులకు అన్ని వసతులు ఏర్పాటు చేయాలని, కరోనా నేపథ్యంలో ప్రతి స్కూల్ లలో శానిటేషన్ చేయించాలని కరోనా నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించాలని విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తరగతులు ప్రారంభించాలని అన్నారు.కరోనా మూడో దశ పొంచి ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్ల లా ఉపయోగం గురించి విద్యార్థులకు తెలియజేసి కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.*ప్రాథమిక వైద్య శాల ను ఆకస్మాత్తుగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే*

కన్నాయిగూడెం మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్యశాల ను అకస్మాత్తుగా తనఖీ చేశారు.అనంతరం ఆమె మాట్లాడుతూ వైద్యశాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహించి సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.*తుపాకుల గూడెం గ్రామంలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే*

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకుల గూడెం గ్రామంలో ప్రేమ్ సాగర్ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సీతక్క ఈ కార్యక్రమంలో కన్నాయిగూడెం జడ్పిటిసి నామ కరంచంద్ గాంధీ,కన్నాయిగూడెం మండల వైస్ ఎంపీపీ బొల్లె భాస్కర్, కన్నాయిగూడెం మండల అధ్యక్షులు ఎండి అప్సర్ పాషా, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య ఏటూరు నాగారం మండల అధ్యక్షులు చిటమట రఘు, కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి రమేష్,కిసాన్ సెల్ మండల అధ్యక్షులు రాజబాబు,కిసాన్ సెల్ మండల ఉపాధ్యక్షులు రాజేందర్, జిల్లా నాయకులు జాడి రాంబాబు,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బోట నాగేశ్, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు తిప్పన పల్లి గంగరాజు,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు సునర కానీ రాంబాబు,దాసరి నరసింహారావు,బుచ్చయ్య నరసింహారావు,బొగ్గుల సుధాకర్,బొల్లె సమ్మయ్య, బిక్షపతి,సమ్మయ్య,పీరీల భాస్కర్,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: