CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన పువ్వాడ

Share it:


👉 【ఎద్దు ఏడ్చిన వ్యవసాయం-రైతు ఏడ్చిన దేశం బాగుపడదు】.

మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి(ఆగస్టు 04):: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతం. మండలంలో నూతనంగా నిర్మించిన రైతు వేదికలు, వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు తదితర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ ఎద్దు ఏడ్చిన వ్యవసాయం-రైతు ఏడ్చినా దేశం బాగుపడదని, రైతు మేలు కోరిన మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గతంలో మన తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎన్నడూ లేని విధంగా రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తూ, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ, రైతుబంధు లాంటి ఆర్థిక సహాయం అందజేస్తూ, రైతులకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు. ముఖ్యంగా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒకేచోట ఏర్పాటు చేసినందుకు ప్రజా ప్రతినిధులను, మండల అధికారులను ఈ సందర్భంగా అభినందించారు. ఉద్యాన పంటలు, పామాయిల్ పంటలు పండిస్తున్న మన అశ్వారావుపేట నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత ఉందని, అది మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాటల్లోనే వెల్లడైందని అన్నారు. రానున్న రోజుల్లో రైతుల అభ్యున్నతి కోసం మరిన్ని సంక్షేమ పథకాలు మన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తీసుకొస్తుందని ఈ సభలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఎంపీపీ సున్నం లలితా, జెడ్పిటిసి భారతి లావణ్య, యువజన నాయకులు వేముల హరీష్ , టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు, జిల్లా మరియు మండల అధికారులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: