CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా లింగాలపల్లి గ్రామంలో కొమరం భీమ్ విగ్రహ ఆవిష్కరణ

Share it:

 


👉 విగ్రహ దాత సోయం అప్పారావు


👉మావ నాటే మా రాజ్యం

మన్యం మీడియా/అశ్వారావుపేట నియోజకవర్గ ప్రతినిధి(ఆగస్టు 09):: ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం, లింగాలపల్లి గ్రామంలో స్థానికులు ఉపాధ్యాయులు విగ్రహం దాత సోయం అప్పారావు వారి సతీమణి సరోజిని ఆధ్వర్యంలో జరుగుతున్న నూతనంగా కొమరం భీమ్ విగ్రహం ప్రతిష్ఠి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన టిఆర్ఎస్ పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ. ప్రజా ప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు, నియోజకవర్గంలోని ప్రజలందరికీ ప్రపంచ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన కొమరం భీమ్ గురించి మాట్లాడుతూ కొమరం భీమ్ 1901 అక్టోబర్ 22 నా ఒక సామాన్య కుటుంబంలో జన్మించాడు అని, సొంతగడ్డపై పరాయి పెత్తనాన్ని సహించలేదు అని, ప్రకృతి ఒడిలో స్వేచ్ఛా జీవితం గడుపుతున్న తమ జాతి పై నిజాం పెత్తనాన్ని తరిమికొట్టిన ధీరుడు అని, అనాదిగా అడవితల్లి ఒడిలో పెరుగుతున్న తన ఆదివాసి స్వేచ్ఛ కోసం పోరాడిన వీరుడు అని, ఆయన వెలుగై చూచిన మావ నాటే మా రాజ్యం అంటే మా ఊరిలో మా రాజ్యం అనే నినాదం. ఉద్యమకారులలో ప్రతిధ్వనిస్తుంది అని, నిజాం నవాబుల దోపిడీ దౌర్జన్యాన్ని ఎదిరించిన గోండు బొబ్బిలి కొమరం భీమ్ అని,తెలుగు పోరాట యోధులలో తెల్ల దొరలను ఎదిరించి వీరమరణం పొందిన  వీరుడు అని,తండ్రి చనిపోయిన తర్వాత  సంకేపల్లి నుండి సుర్దాపూర్ వెళ్లిపోయాడని. అక్కడ  భీమ్ పంట పొలాల పై సిద్దిక్ అనే వ్యక్తి దౌర్జన్యంగా పంటపొలాలను కాజేయడం  వలన సిద్దిక్ ను భీమ్ చంపడంతో ఆదివాసీలు సాయుధ పోరాటం మొదలైంది అని, చివరగా 1941 సంవత్సరంలో నిజాం నవాబు పరాయి పాలనను ఎదిరించి భీమ్ వీరమరణం పొందాడు అని, జారే ఆదినారాయణ చెప్పారు. ఈ కార్యక్రమంలో లింగాలపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ వాడె జయ, దమ్మపేట మండల ఎంపీపీ సోయం ప్రసాద్, ఎంపీటీసీ విజయలక్ష్మి, అప్పారావు, ఉపాధ్యాయులు సోయం శ్రీనివాస్ రావు,ఎటియఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కుర్సం రామారావు, గ్రామ అధ్యక్షులు & విద్యా కమిటీ చైర్మన్  కొర్స రవి, వార్డు మెంబర్ చాప ఆనంద్, మాజీ ఎంపీటీసీ సోయం బాలరాణి, సోయం నాగబాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఊకే బుల్లిబాబు,పాయం నాగరాజు, సోయం వీరస్వామి, సోయం జగ్గయ్య, సున్నం కోటేష్, పొట్టా వెంకటలక్ష్మి , సున్నం రమేష్ , చాప చలమరావు ,గండుగులపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ సుశీల, రజేష్ , ఆదివాసీ దమ్మపేట మండల నాయకులు బండారు సూర్యనారాయణ,మడకం జయ, గ్రామంలోని గిరిజన యువతీ యువకులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: