CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మాడిఫైడ్ మ్యాన్ హోల్ ప్రయోగం-పంద్రాగస్టు వేడుకలలో సంతోషం

Share it:

 



తెలంగాణ ప్రభుత్వ విప్ రేగా, భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ చేతుల మీదుగా ప్రశంశా పత్రం అందుకున్న అక్రమ్.


ఎక్సలెంట్ పాఠశాలలో ఎక్సలెంట్ విద్యార్థి


మన్యం మనుగడ, పినపాక:


ఇటీవల తెలంగాణా ప్రభుత్వం నిర్వహించిన నూతన ఆవిష్కరణ లో భాగంగా ఇంటింటా ఇన్నోవేటర్ ప్రదర్శన- 2021లో ఎక్సలెంట్ బాషా హై స్కూల్ విద్యార్థి జునైద్ ఆక్రం తాను కనుగొన్న నూతన ఆవిష్కరణ మాడిఫైడ్ మాన్ హోల్ సిస్టం ఎంపిక అయింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం లో నిర్వహించిన 75 వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భద్రాద్రి కొత్తగూడెంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, కలెక్టర్ చేతుల మీదుగా ఎక్సలెంట్ బయ్యారం స్కూల్ కు చెందిన పదవ తరగతి విద్యార్థి జునైడ్ ఆక్రం తాను కనుగొన్న నూతన ఆవిష్కరణ మాడిఫైడ్ మాన్ హోల్ సిస్టం ఇంటింటా ఇన్నోవేటర్ ఆవిష్కరణ కు ప్రశాంసా పత్రం అందుకోవటం జరిగింది. ఈ నూతన ఆవిష్కరణను భద్రాద్రి కొత్తగూడెం స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వం విప్ రేగా కాంతారావు, కలెక్టర్ మాడిఫైడ్ మాన్ హోల్ సిస్టం గురించి స్వయంగా అడిగి తెలుసుకొనటం జరిగింది. ఈ సందర్బంగా జునైడ్ ఆక్రం తన నూతన ఆవిష్కరణ ద్వారా భవిష్యత్తులో ఎటువంటి మరణం సంబవించకుండా ఉండాలంటే తాను కనుగొన్న మాన్ హోల్ సిస్టం నూతన ఆవిష్కరణ ద్వారా అది సాధ్యం అని తాను ప్రెసెంటేషన్ ద్వారా వివరించటం జరిగింది.

మోడీ ఫైడ్ మ్యాన్ హోల్ నమూనా గురించి ఎక్సలెంట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ యూసఫ్ షరీఫ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ, విప్ రేగా కాంతారావు, కలెక్టర్ లకు తన విద్యార్థి కనుగొన్న నూతన ఆవిష్కరణగురించి విపులంగా వివరించారు.ప్రస్తుతం మనం మ్యాన్ హోల్ ఫైన మూతగా సిమెంట్ బ్లూక్ ని ఉపయోగిస్తున్నాము దానివల్ల వర్షం వల్ల రోడ్ నీటితో నిండినప్పుడు నీటిని డ్రైనేజ్ లో కి పంపడానికి మ్యాన్ హోల్ పై మూతలా ఉండే సిమెంట్ బ్లాక్ ని తొలగించవలసి వస్తుంది. ఈ క్రమంతో చాలామంది ఆ మ్యాన్ హోల్ లో పడి ప్రమాదాలకు గురి అవుతున్నారు. ఈ ప్రమాదాలను నివారించడానికి మోడీ ఫైడ్ మ్యాన్ హోల్ తయారు చేస్తాము . మనం ప్రస్తుతం ఉపయోగిస్తున్న సిమెంట్ బాక్ స్థానంలో లో మోడీ ఫైర్ మాన్ హోల్ పరికరాన్ని అమర్చాలి. ఈ పక్రియలో రోడ్డుపై పడ్డ వర్షపు నీరు జాలి ద్వారా మ్యాన్హోల్లో కి వెళ్తుంది నీటి బరువుకి అక్కడ ఉండే పిస్టన్ కిందికి జరిగి నీరు వెళ్లే మార్గాన్ని ఏర్పరుస్తుంది నీరు తగ్గగానే మళ్లీ పిస్టన్ యధావిధిగా పైకి వస్తుంది. ఇది పూర్తిగా నీటి బరువు ఆదారంగా ఆటోమేటిక్ గా పనిచేస్తుంది.ట్రాఫిక్ కి ఎటువంటి అంతరాయం లేకుండా రోడ్డుపై నీరు ఆగకుండా మ్యాన్హోల్లో కి వెళ్లిపోతుంది ఈ విధంగా మ్యాన్హోల్ వల్ల జరిగే యాక్సిడెంట్ లను కూడా నివారించవచ్చు అని ఈ సందర్బంగా తమ ఎక్సలెంట్ విద్యార్థి ఆవిష్కరణ గురించి ఎక్సలెంట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ యూసఫ్ షరీఫ్ వివరించారు .తదనంతరం ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, కలెక్టర్ లు సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా వారు జునైడ్ ఆక్రం నూతన ఆవిష్కరణ రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయికి ఎంపిక అవటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇలాగే మంచి ప్రదర్శన ఇచ్చి జాతీయ స్థాయిలో కూడా ఎంపిక కావాలి అంటూ భుజం తట్టి ప్రోత్సహించినారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు,భద్రాద్రి కొత్త గూడెం కలెక్టర్ అనుదీప్, ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, జిల్లా సైన్స్ అధికారి చలపతి రావు, సహాయ అధికారి సంపత్,ఎక్సలెంట్ యాజమాన్యం మహమ్మద్ ఖాదర్, యూసఫ్ షరీఫ్ గబ్బర్, ముక్కు వెంకట నర్సారెడ్డి, బండారు నరేందర్, ఎక్సలెంట్ బాషా హై స్కూల్ ప్రిన్సిపాల్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: