CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉అంబేద్కర్ సాక్షిగా నాకు అవమానం జరిగింది - నేను సహించబోను..ఇంత దారుణమా?

Share it:


*👉 జనం మధ్య దళిత గిరిజన బిడ్డను నిర్లక్ష్యం చేస్తారా.. -ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఫైర్

*👉 - చీఫ్ సెక్రటరీకి, స్పీకర్ కు ఫిర్యాదు చేస్తా

 (భద్రాద్రి కొత్తగూడెం-మన్యం మీడియా): అంబేద్కర్ సాక్షిగా తనకు అవమానం జరిగిందని, ప్రొటోకల్ అంటే మీకు తెలియదా.. గిరిజనుడనేగా మీరు...ఇలా చేశారంటూ పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అధికారులపై ఫైర్ అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి శనివారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తోపాటు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావులతో పాటు జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరు కావడం జరిగింది. అయితే సభ వేదిక పైకి ప్రజాప్రతినిధులను, ఇతర అధికారులను పిలిపించి రేగా కాంతారావు స్టేజీ మీదకు పిలువకపోవడంతో రేగా కాంతారావు భగ్గుమన్నారు. కొత్తగూడెంలో మున్సిపల్ పరిధిలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి తన ఫోటో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయలేదని సభా వేదిక మీదికి ప్రోటోకాల్ పాటించి ఆహ్వానించలేదని రేగా నిప్పులు చెరిగారు. పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం వాటర్ ఫౌంటెన్ సెంట్రల్ లైటింగ్ పనులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించగా ఇక్కడకూడా రేగాకు సరైన ప్రధాన్యత ఇవ్వకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్రరావుకు మాతో అవసరం లేనప్పుడు మమ్మల్ని ఎందుకు ఆహ్వానించారు..? ప్రజల మధ్య ఎందుకు అవమానిస్తున్నారని రేగా మండిపడ్డారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ కు మౌఖికంగా ఫిర్యాదు చేస్తున్నానని, తర్వాత లిఖిత పూర్వకంగా చీఫ్ సెక్రటరీకి, అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు రేగా కాంతారావు సభా వేదిక మీద ప్రకటించారు. సాక్షాత్తు అంబేద్కర్ విగ్రహం ప్రారంభం ఆదివాసి ప్రజాప్రతినిధిగా అవమానం జరగడం పట్ల తీవ్ర మనస్తాపానికి గురైనట్లు రేగా అన్నారు. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. అనంతరం సభావేదికలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ పాల్గొన్నారు.

Share it:

Post A Comment: