CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జగ్గారం పంచాయతీని పట్టి పీడిస్తున్న జ్వరాలు

Share it:

  



ఇప్పటికీ డెంగ్యూ జ్వరాలతో ఐదుగురు మృతి


జిల్లా అధికారులు స్పందించాలని గ్రామ ప్రజల వినతి


ఎంపీపీ గుమ్మడి గాంధీకి వివరించిన గ్రామ ప్రజలు


వెంటనే స్పందించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు


మన్యం మనుగడ, పినపాక: 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని జగ్గారం పంచాయతీని విషజ్వరాలు పట్టిపీడిస్తున్నాయి . ఈ కారణంగా ఇప్పటికే ఐదుగురు ప్రజలు మృత్యువాత పడ్డారు. జగ్గారం పంచాయతీలో గతంలో డెంగ్యూ వ్యాధి కారణంగా సల్లూరి  సత్యం చనిపోవడంతో వెంటనే స్పందించిన వైద్యాధికారులు జులై నెలలో జగ్గారం గ్రామంలో ఆరోగ్య శిబిరం నిర్వహించి, రక్త పరీక్షలు జరిపి మలేరియా, టైఫాయిడ్ కు సంబంధించిన ఫలితాలను అక్కడే తెలపడం జరిగిందని జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు శృతి తెలియజేశారు. కానీ పినపాక మండల ఆరోగ్య కేంద్రాల పరిధిలో డెంగ్యూ పరీక్షకు సంబంధించిన పరికరాలు లేకపోవడంతో, ఆ పరీక్ష కావాలంటే భద్రాచలం ప్రాంతానికి వెళ్ళ వలసి వస్తుందని, ఆర్థిక భారంతో, అవగాహనా లోపంతో ఆసుపత్రికి వెళ్లలేక మృత్యువాత పడుతున్నారని, జగ్గారం గ్రామ ప్రజలు వాపోతున్నారు. భద్రాచలంలో తమ గ్రామం నుండి ఇప్పటి వరకు సుమారు 45 మంది వరకు డెంగ్యూ పరీక్షలు చేయించుకుని, చికిత్స పొంది లక్షల రూపాయలను వైద్యానికి ధారపోశామని అని ఆవేదన చెందారు . జిల్లా వైద్య అధికారులు స్పందించి, ఏజెన్సీ ప్రాంతమైన పినపాక మండలంలో డెంగ్యూ పరీక్షలు కూడా జరిగే విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నారు. ఈ విషయమై పంచాయతీ సర్పంచ్ గుమ్మడి అనంతం వివరణ కోరగా, పారిశుద్ధ్యానికి సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, అవగాహనా లోపంతో ఆసుపత్రికి వెళ్లలేని పరిస్థితిలో మృత్యువాత పడుతున్నారని తెలియజేశారు. సోమవారం రోజున జగ్గారం పంచాయతీకి చెందిన సల్లూరి పార్వతి డెంగ్యూ కారణంగా చనిపోవడంతో, విషయం తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాలతో పరామర్శించడానికి వెళ్ళిన మండల ఎంపిపి గుమ్మడి గాంధీ కి డెంగ్యూ పరీక్షలకు సంబంధించిన విషయాల గురించి, గ్రామ ప్రజలు పూర్తిగా వివరించారు. వెంటనే పంచాయతీ ట్రాక్టర్ ను పిలిపించి హైపో క్లోరైడ్ ద్రావణాన్ని గ్రామమంతా పిచికారి చేయించడం జరిగింది .అనంతరం

 ఎంపీపీ గుమ్మడి గాంధీ పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు కు చరవాణి ద్వారా తెలియజేయగా, జిల్లా వైద్య అధికారులతో మాట్లాడి , మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జగ్గారం గ్రామంలో మృత్యువాత పడిన వారి కుటుంబాలకి అండగా ఉంటానని, చరవాణి ద్వారా ఎంపీపీ గుమ్మడి గాంధీ కి  తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రవి వర్మ, జగ్గారం గ్రామపంచాయతీ ప్రజలు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: