CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైతు రుణమాఫీ, ఫసల్ బీమా, అమలు చేయాలంటూ బిజెపి డిమాండ్..

Share it:

 


మన్యం టీవీ : జూలూరుపాడు, ఆగస్టు 9, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు లో సోమవారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ (చిన్ని) మాట్లాడుతూ.. బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈనెల 11వ తేదీన లక్ష రూపాయల రైతు రుణ మాఫీ చేయాలని, ఫసల్ బీమా అమలు చేయాలని, తహసిల్దార్ కార్యాలయం ఎదుట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంన్ని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష చేపట్టడం జరుగుతుందన్నారు.

నేడు రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ సహాయం కింద ఎనిమిదవ విడుత రైతుల ఖాతాల్లో 19,500 కోట్ల రూపాయలు, 9.57 కోట్ల మంది రైతులకు ఖాతాలో రెండు వేల రూపాయల చొప్పున ప్రధానమంత్రి మోడీ  వేసినందుకు రైతుల తరపున మోడీ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వల్ల అతివృష్టి అనావృష్టి వలన పంటలకు నష్టం జరిగితే పూర్తి నష్టపరిహారం వస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లించకపోవడంతో తెలంగాణ లో ఫసల్ బీమా అమలు కావడం లేదని అన్నారు.

 భూసార పరీక్ష లకు తెలంగాణ కు 120 కోట్లు ఇస్తే ఈ నిధుల ను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి  పట్టించిందన్నారు. భూసార పరీక్షలు చేయకపోవడంతో రైతులకు ఏ పంట వేయ్యలో తెలియక నష్టపోతున్నారని అన్నారు.టిఆర్ఎస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి ఏడు సంవత్సరాలు గడిచినా కూడా ఈ జిల్లాలో   ఒక్క ఎకరం కూడా ఏ రైతుకు ఇవ్వలేదని తెలిపారు. దళితులకు 10 లక్షల రూపాయలు హుజురాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇస్తానన్న కేసీఆర్ దళితులను మరోసారి మోసం చేస్తున్నారని అన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్న కెసిఆర్ 10 లక్షలు కాదు, ప్రతి దళిత కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రైతులకు కేంద్ర ప్రభుత్వం ఎరువులకు భారీ సబ్సిడీ ఇస్తుందని అన్నారు. డి ఏ పి  కట్టా 2400 రూపాయలు కాగ మోడీ ప్రభుత్వం  కట్టాకు1200 రూపాయల సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. అలానే అన్ని ఎరువులకు కూడా భారీ సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని అన్నారు.మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్ల ఇస్తానన్న కేసీఆర్ నేటికీ పూర్తికాలేదని గుర్తుచేశారు.పోడు వ్యవసాయం చేస్తున్న రైతులను కేసీఆర్ ఫారెస్ట్ అధికారులను ఉసిగొలిపి  వారిపై కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.కెసిఆర్ ఏడేళ్ల నుంచి కూడా నేను పోడు సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మాయమాటలు చెబుతూ ప్రతి ఎన్నికల్లో మోసం చేసుకుంటూ గెలుపొందుతున్నాడని,  కానీ కేసీఆర్ ని  నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని, కావున  రాబోయే ఎన్నికల్లో  తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని)అన్నారు.ఈ సమావేశంలో  బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్,  కిసాన్మోర్చా జిల్లా అధ్యక్షుడు కోనేరు నాగేశ్వరరావు, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శులు  భుక్య సీతారాం నాయక్, ఎడ్లపల్లి శ్రీనివాస్ కుమార్,  బిజెపి జిల్లా కోశాధికారి నున్న రమేష్,  కిసాన్మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మాదినేని సతీష్ , బిజెపి మండల అధ్యక్షుడు సిరిపురపు ప్రసాద్ ,  భుక్య శ్రీను, గోపాల‌రావు ,వందనపు సుబ్బు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: