మన్యం టీవీ చర్ల:
కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురె 182 ఫోటోగ్రఫీ డే దినోత్సవం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం బైక్ ర్యాలీ చేస్తూ ఫోటోగ్రాఫర్ల ఐక్యత వర్ధిల్లాలి అని నినాదాలు ఇస్తూ కొయ్యుర్ ప్రాథమిక ఆరోగ్య ఆస్పత్రుల్లో రోగులకు, గర్భిణీ స్త్రీల కు పండ్లు బ్రెడ్డు పంచడం జరిగింది .ఆగస్టు 19 ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా చర్ల మండల ఫోటోగ్రాఫర్లకు గుర్తింపు కార్డులు మండల అధ్యక్షులు గారి చేతుల మీదగా పంచడం జరిగింది .ఫొటోగ్రాఫర్ల ఐక్యత వర్ధిల్లాలి అంటూ ఫోటోగ్రాఫర్లు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తాండవ రాయుడు, ప్రధాన కార్యదర్శి మచ్చ రాజా ,కోశాధికారి బీరెల్లి సాంబ ,బొల్లే సందీప్, హేలేష్, తిరుపతిరావు, ముక్కాల శివ, గగ్గురిశ్రీను, శ్రావణ్, మహేష్, రమేష్, ప్రదీప్ ,తిలక్ ,విజయ్ ,రామారావు, పి. సాయికుమార్, బాలరాజ్, సారయ్య , ప్రవీణ్ , నవీన్ లు పాల్గొన్నారు
Post A Comment: