CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

స్వాతంత్ర భారతంలో దళిత స్త్రీకి రక్షణ కరువు

Share it:

 


*స్వాతంత్య్రం వచ్చిన రోజే నడి రోడ్డు మీద పొడిచి చంపినోడిని ఉరితీయాలి

*పరాయి స్త్రీ మీద చెయ్యి వెయ్యాలంటేనే వెన్నులో వణుకు వచ్చేలా కఠిన చర్యలు తీసుకోవాలి

సురేష్ గుగ్గిళ్ల డిమాండ్.


మన్యం టీవీ మంగపేట.


బీటెక్ చదువుతున్న దళిత విద్యార్థి రమ్య ను హత్య చేసిన వారిని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపి దుండగులను వెంటనే ఉరితీయాలని ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జ్ గుగ్గిళ్ళ సురేష్ మాదిగ పత్రికా విలేఖరులతో మాట్లాడడం జరిగింది. మన రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినది కానీ స్త్రీలకు మాత్రం స్వేచ్చ లేదు. స్వతంత్రం రాకముందు స్త్రీల పరిస్థితి ఎలా ఉందో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కూడా అలాగే ఉంది స్త్రీల స్వాతంత్రం రాకముందు ఒంటరిగా స్త్రీలు తిరుగుతే ఏమి జరుగుతుందో అని భయపడేవారు. ఇప్పుడు భారత దేశానికి స్వాతంత్రం వచ్చినాక కూడా స్త్రీల మీద అత్యాచారాలు మానభంగాలు జరుగుతూనే ఉన్నాయి.స్త్రీల మీద అత్యాచారాలు మానభంగాలు జరగకుండా ఉండాలి అంటే భారతదేశ ముఖ్యమంత్రులు అత్యాచారాలు చేసిన వ్యక్తులను వెంటనే ఉరి తీయాలి. అలా చేస్తేనే మన భారతదేశపు స్త్రీలను గౌరవించినట్లు అని ఎమ్మార్పీఎస్ మంగపేట మండలం గుగ్గిళ్ల సురేష్ మాదిగ డిమాండ్ చేశారు.ఎందరో నా ఆడబిడ్డ లైన టేకు లక్ష్మీ మానస, మహాలక్ష్మి ఠాకూర్,అంబాజీపేట లో దళిత మహిళలపై దాడి చేసినట్లు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు నడిరోడ్డు మీద కత్తితో పొడిచి మా దళిత చెల్లెలు నల్లపు రమ్య కూడా హత్య చేశారు, ఎన్నో హత్యలు అత్యాచారాలు నా దళిత జాతి పై జరుగుతున్నాయి ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షలు వేయకపోవడం వలన దుండగులు దళిత ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేస్తున్నారు.వారి నీ వెంటనే ఎన్కౌంటర్ చేయాలని ఎమ్మార్పీఎస్ మండల నాయకులు గుండెట్టి జంపయ్య,లంజా పెళ్లి పున్నారావు,కీసర సారయ్య, గుగ్గిళ్ల సురేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ మండల అధికార ప్రతినిధి గాజర్ల రాజు మాదిగ డిమాండ్ చేస్తున్నారు. తూనూరు రాజు,తిప్పని రాంకీ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: