CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జూలూరుపాడు లో అంబరాన్నంటిన ఆదివాసి సంబురాలు..

Share it:

 


👉 ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు..

👉 కదిలిన ఆదివాసి మహిళా లోకం..


మన్యం టీవీ : జూలూరుపాడు,

ఆగస్టు 9, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా అందరికీ ప్రపంచ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మండల వ్యాప్తంగా ఆదివాసి పల్లెల్లో జండా ఆవిష్కరణలు చేసి ఆదివాసీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మహిళలు, యువకులు, మండల కేంద్రానికి చేరుకొని భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జూలూరుపాడు ప్రధాన సెంటర్ నందు ఆదివాసి జండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ.. ఆదివాసి అస్తిత్వం కోసం, హక్కులకోసం, భూమికోసం, బానిసత్వం నుండి విముక్తి కోసం, "జల్ జంగిల్ జమీన్" అనే నినాదంతో నాటి బ్రిటిష్ పాలకులను ఎదిరించి పోరాడిన కొమరం భీమ్, బిర్సా ముండా, గంటందొర, మల్లు దొర, లాంటి ఎంతోమంది ఆదివాసి పోరాటయోధులు తమ జాతి కోసం చేసిన పోరాటాలను ప్రాణ త్యాగాలను గుర్తు చేశారు. ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను, చట్టాలను, పటిష్ఠంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. 5వ షెడ్యూల్ గిరిజన ఆదివాసి ప్రాంతంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే జీవోల రద్దు, టైగర్ జోన్ ల ఏర్పాటు, ఆదివాసీ పోడు భూములలో హరితహారం పేరుతో  మొక్కలు నాటుట, ఓపెన్ కాస్ట్ ల ఏర్పాటు, ప్రాజెక్టుల పేరుతో ఆదివాసీలను నిర్వాసితులను చేయడం, ఆదివాసీ గిరిజన పోడు రైతుల పై ఫారెస్ట్ అధికారుల దాడులు, లాంటి కార్యక్రమాలు ప్రభుత్వాలు మానుకోవాలని కోరారు. లేనిపక్షంలో ఆదివాసి తిరుగుబాటు ఉద్యమాలతో పాలకులకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు అరెం రామయ్య, యధళ్ళపల్లి వీరభద్రం, బచ్చల లక్ష్మయ్య, సంగం నాగరాజు, తెల్లం నరసింహారావు దొర,సోడెం శ్రీరామ్, కాలం నరసింహారావు, ఈసం నర్సింహులు, సిద్ది బోయినా పుల్లారావు, చింత జగన్నాథం, సర్పంచులు కట్రం మోహన్ రావు, మల్కమ్ విక్రమ్, ముక్తి నరసింహారావు, దొడ్డ వెంకటరామారావు, గలిగే సావిత్రి, యధళ్ళపల్లి కళాశ్రీ, మాజీ వైస్ ఎంపీపీ కొడెం సీతాకుమారి, ఆదివాసి ఉద్యోగులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: