CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైతులు పంట వివరాలు నమోదు చేసుకోవాలి

Share it:

 


మన్యం మనుగడ, పినపాక

:పినపాక మండలంలో ఎల్చిరెడ్డిపల్లి గ్రామంలో పంటల నమోదు ప్రక్రియను పర్వవేక్షించిన సహాయ వ్యవసాయ సంచాలకులు తాతారావు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి సంవత్సరం రైతులు సాగు చేస్తున్నటువంటి వివిధ రకాల పంటలను క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు ఆత్మ సిబ్బంది ద్వారా నమోదు చేయించి ఆ వివరాలను జిల్లా కార్యాలయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు ఇస్తున్నారు .అప్పుడు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం అభివృద్ధి కోసం వివిధ రకాల ప్రణాళికలు చేపట్టుటకు సూక్ష్మస్థాయిలో ప్రణాళికలు తయారు చేయుటకు మరియు కేంద్ర ప్రభుత్వం నుండి ఎరువులు రాష్ట్రానికి సరఫరా చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసే సమగ్ర ప్రణాళికకు క్షేత్రస్థాయిలో చేపట్టే పంటల నమోదు ప్రక్రియ ఎంతో మంచిగా ఉపయోగపడుతున్న ది . ఇందులో భాగంగా ఈ మధ్యకాలంలో రైతులలో మంచి మార్పులు సంభవిస్తున్నాయి అనగా కొత్త కొత్త పంటల వైపు మొగ్గు చూపుతున్నారు అనగా అయిల్‌పామ్, డ్రాగన్ , తైవాన్ జామ , ఆపిల్ , బొప్పాయి కూరగాయలు , పుష్పాలు వివిధ రకాల మల్బరి రకాలను సాగు చేస్తున్నారు . క్షేత్ర స్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు ఆత్మ సిబ్బంది ఎంతో కష్టపడి సర్వేనెంబర్ ప్రకారము మరియు పట్టా పాస్ బుక్ నెంబర్ ప్రకారం వివిధ రకాల పంటలను నమోదు చేసి జిల్లా యంత్రాంగానికి అందిస్తున్నారు . తద్వారా జిల్లా యంత్రాంగానికి, రాష్ట్ర వ్యవసాయ శాఖకు సమాచారం సమగ్రంగా అందుతుంది. తద్వారా రాష్ట్ర వ్యవసాయ శాఖ రైతు సంక్షేమం అభివృద్ధి కోసం వివిధ రకాల ప్రణాళికలు తయారు చేయుటకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నది.ఎల్చిరెడ్డిపల్లి గ్రామంలో సహాయ వ్యవసాయ సంచాలకులు తాతారావు రైతులు సాగు చేస్తున్న పంటల నమోదు కార్యకమాన్ని పరిశిలించారు . అంతకు ముందు రైతులతో మాట్లాడుతూ రైతులు సాగు చేస్తున్న పంటలను తప్పనిసరిగా సర్వేనెంబరు ప్రకారం నమోదు చేయించుకోవాలని సుంచించారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు తాతారావు గారు,వ్యవసాయ విస్తరణ అధికారి కొమరం లక్ష్మణ్ రావు గారు, ఆత్మ ఏటియం యం. సుజాత, భూక్య పవన్ కుమార్ రైతులు వంక నర్సింహా రావు, సోడె వెంగళరావు మరియు ఇతర రైతులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: