CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు

Share it:

 



ఎదురు కాల్పులలో ఒక మగ మావోయిస్ట్ మృతి


మన్యం టీవీ చర్ల:

మావోయిస్ట్ వారోత్సవాలలో భాగంగా విధ్వంసం సృష్టించడానికి చర్ల లాస్ మరియు బెటాలియన్ యాక్షన్ టీంలు  చర్ల మండలంలో కుర్ణపల్లి - బోదనెల్లి  ప్రాంతాల్లో సంచరిస్తు నమ్మదగిన సమాచారంతో స్పెషల్ పార్టీ పోలీసు బలగాలతో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. ఈ కూంబింగ్ లో భాగంగా

ఈ రోజు  ఉదయం సమయంలో 10 మంది సాయుధ మావోయిస్టులు బోధనెల్లికి తూర్పు దిశలో 3 కిలోమీటర్ల దూరంలో సంచరిస్తున్నారు.

ఉదయం 8.15 గంటల సమయంలో పోలీసు బలగాలకు మరియు మావోయిస్టులకు మధ్య బోధనెల్లికి తూర్పు దిశలో 3 కిలోమీటర్ల దూరంలో ఎదురు కాల్పులు జరిగాయి.అనంతరం కాల్పులు జరిగిన ప్రదేశంలో సోదాలు జరపగా సుమారుగా 23 సంవత్సరాల వయసు కలిగిన ఒక మగ మావోయిస్టు మృతదేహాన్ని,303 రైఫిల్ మరియు రెండు కిట్ బ్యాగులను పోలీసు వారు స్వాదీనం చేసుకోవడమైనది.కాల్పులు జరిగిన పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Share it:

Post A Comment: