CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జీవవైవిధ్యం పై అవగాహన సదస్సు.

Share it:

 


మన్యం టీవీ కరకగూడెం: మండలరిదిలోని కన్నాయిగూడెం గ్రామపంచాయతి లో జీవవైవిధ్యం పై సర్పంచ్ భూక్యా. భాగ్యలక్ష్మి అధ్యక్షతన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రంలో ఆధార్ స్వచ్చంద సంస్థ డైరెక్టర్ తోలెం రమేష్ పాల్గొని మాట్లాడుతూ జీవవైవిధ్యం పై కమిటీ సభ్యులకు జీవవైవిధ్యం అనగా పర్యావరణంతో సహా ప్రకృతిలో ని జీవరాసులని కలిసి ఉన్న విధానానే జీవవ్యవైద్యం అంటారు. జీవవైవిధ్యం ప్రకృతి ఇచ్చిన వరం. మానవుని మనుగడ ఆధారం. దానిని కాపాడుకోవడం మన రక్షణ కర్తవ్యం, ప్రకృతి మనకు అన్నిటిని సమకూరుస్తుంది. మనం ప్రకృతిని కాపాడితే అది మనలి కాపాడుతుంది. ప్రకృతి రక్షితో రక్షిత. ప్రకృతిలో ఎన్నో జీవరాశులు, సూక్ష్మజీవులు, బాక్టీరియా, పులి, ఏనుగు, సింహాలు, నదులు, సముద్రాలలో ని చిన్న చేపలు, తిమింగలాలు, చిన్న గడ్డి మొక్కల నుండి పెద్ద వృక్షాల వరకు దాదాపుగా 84 లక్షల జీవరాశులు ఎంతో వైవిద్యం. కానీ మనకు తెలిసినవి 20 లక్షల జీవరాశులు మాత్రమే. పూల మొక్కలు, పండ్ల మొక్కలు, రంగురంగు పక్షులు, సీతాకోక చిలుక, సంగీతాన్ని నందించే కోయిలలు కందిరీగలు, తేనే టి గా లు, రకరకాల పక్షులు, జంతువులు, వీటి పై బయోడైవర్సిటీ కమిటీ సభ్యులు లకు అవగాహనా కల్పించారు. బీఎంసీ సభ్యుల తో మొక్కలు నా టించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, తరుణ్ ఉప సర్పంచ్ గుండ్ల. సంతోష్ పిసా కమిటీ ఉప అధ్యక్షులు పోలెబోయిన. శేఖర్, జీవవైవిధ్య పరిరక్షణ కమిటీ సభ్యులు, ఆధార్ వాలంటీర్స్ రామకృష్ణ, గణేష్, సారయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: