CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు భూములకు పట్టాలు ఇప్పించండి విప్ రేగా కు:సి.పి.ఐ ఎం.ఎల్ కార్యదర్శి మధుసూదన్ రెడ్డి వినతి

Share it:

 



మన్యం టీవీ మణుగూరు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా నేటి కొత్తగూడెం జిల్లాలో గిరిజన ప్రజలకు ప్రధాన జీవనాదారం పోడు వ్యవసాయమేనని,గిరిజనులు అడవిలో పుట్టి, అడవిలోనే జీవిస్తూ, అడవిలోనే మరణిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని పొడు ఆక్రమణదారులని ముద్రవేసి,అటవీ హక్కుల చట్టాన్ని కూడా తుంగలో తొక్కి,గిరిజన,ఇతర పేదలపై ఫారెస్ట్ పోలీస్ అధికారుల దాడులు,దౌర్జన్యాలు చేస్తూ, అక్రమ కేసులకు పాల్పడుతున్నారు అని తెలిపారు.ఈ సమస్య ను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని,కానీ ఆచరణలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు కానీ, పేద,గిరిజన ప్రజలపై దాడులు,కేసులు పెరిగాయి అన్నారు.పొడు రైతులకు అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు ఇప్పించండి లేదా పదవికి రాజీనామా చేసి గిరిజను ప్రజల పక్షాన నిలబడాలి అని కోరుతూ సి.పి.ఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ కార్యదర్శి ఆర్.మధుసూదన్ రెడ్డి విప్ రేగా కాంతారావు వ్యక్తిగత సహాయకులు చందా. హరికృష్ణ కు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎండీ.గౌస్, కె.కనకదుర్గ,కె.సారమ్మ,కే.లాలమ్మ,కే.చుక్కమ్మ,కాటబోయిన.వెంకటేశ్వర్లు,కె.పాపయ్య,కె.సారమ్మ,రామకృష్ణ, నవీన్,వెంకటనర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: