CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విద్యాసంస్థలను ప్రారంభించి, కరోనా జాగ్రత్తలు పాటించాలి

Share it:

 


 మన్యం టీవీ మంగపేట.


తోకల రవి ఎస్ఎఫ్ఐ ములుగు జిల్లా అధ్యక్షులు రాష్ట్రంలో తక్షణమే విద్యాసంస్థలను ప్రారంభించి, కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ "భారత విద్యార్థిఫెడరేషన్" (ఎస్ఎఫ్ఐ) ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం మంగపేట మండల కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎస్.ఎఫ్.ఐ ములుగు జిల్లా అధ్యక్షుడు తోకల రవి ఈసందర్భంగా మాట్లాడుతూ... ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ చేసిన ఉద్యమాల ఫలితంగా నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి విద్యాసంస్థలు ప్రారంభం అని ప్రకటించడం జరిగిందన్నారు.కానీ విద్యా సంస్థలలో కరోనాకు సంబంధించినటువంటి జాగ్రత్తలు గాని, మార్గదర్శకాలు గాని దానికి సంబంధించి నటువంటి బడ్జెట్ను విడుదల చేయకుండా కేవలం ప్రారంభంచేయండి అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. దాదాపు కరోనా వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు విద్యా వ్యవస్థ మొత్తం కూడా కనుమరుగయిందన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్యా సంస్థలు ప్రారంభించే ముందు ఆ విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కనీస సౌకర్యాలైన త్రాగునీరు, మూత్రశాలలు,మరుగుదొడ్లు, విద్యుత్,ఫర్నిచర్ సౌకర్యాలు కల్పించి విద్యార్థులకుఅందుబాటులో ఉంచాలి. అదేవిధంగా ఇప్పటికే రిషలైజెషన్ పేరుతో రాష్ట్రంలోనే ప్రభుత్వ పాఠశాలలో మూసివేతకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇది కాక జరిగితే రాష్ట్ర ప్రభుత్వ విద్య అనేది విద్యార్థులకు అందనంత దూరంగా ఉంటుందన్నారు. విద్యా సంస్థల మూసివేతకు ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని, విద్యారంగంలో కాళీ గా ఉన్నటువంటి సిబ్బంది ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ ప్రైవేట్పాఠశాలలు,కళాశాలలో విద్య బోధించే ఉపాధ్యాయులు ఉపాధి లేక చాలామంది రోడ్ల పైన కూరగాయలుఅమ్ముకుంటూ, ఉపాధి పని కి వెళ్తూ జీవనంసాగిస్తున్నారన్నారు. వాళ్ల కోసం ప్రభుత్వ ఆపత్కాల భృతి ఇస్తున్నామని ప్రకటించింది.కానీ కేవలం రెండు నెలలు మాత్రమే ఇచ్చిందన్నారు. మళ్లీ ఇవ్వకపోవడం లో చాలా మంది ఉపాధ్యాయులు ఇబ్బందులు 

ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లాలో ఉన్నటువంటి బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు ఆదుకోవాలని, ప్రైవేట్ పాఠశాలలో మూతపడడంతో ఉపాధి లేక చాలా మంది ప్రైవేటు ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు.ఆత్మహత్యలు చేసుకున్న ప్రైవేట్ ఉపాధ్యాయుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా జిల్లాలో పెండింగ్ లో ఎస్సి, ఎస్టీ బీసీ వెల్ఫేర్ కు సంబంధించినటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఈ సందర్బంగా కోరారు.

ప్రభుత్వం కల్ల బొల్లి మాటలతో కాలం వృధా చేయకుండా కొరోనా నివారణకు మార్గదర్శకాలు విడుదల చేసి ఆచరణలో పెట్టాలని పేర్కొన్నారు.తక్షణమే విద్యాసంస్థలు ప్రారంభించి,విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని వారు ఈ సందర్బంగా డిమాండ్ చేశారు.సమావేశంలో తీసుకున్న డిమాండ్స్ ఇలా ఉన్నాయి.

1) రాష్ట్రవ్యాప్తంగా తక్షణమే విద్యాసంస్థలను ప్రారంభించి, కరోనా పై జాగ్రత్తలు పాటించాలి...

2) రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 3,850 కోట్ల స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి...

3) ప్రైవేట్ విద్యా సంస్థలలో పనిచేసే ఉపాధ్యాయులకు, ప్రభుత్వం ఇస్తున్న రెండు వేలను 5 వేలు పెంచి సహాయాన్నికొనసాగించాలి..దీనిని ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్లకు కూడా వర్తింప చేయాలి..

4) రేషనలైజేషన్ పేరుతో పాఠశాల మూసివేత మానుకోవాలి...

5) జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, అప్పటివరకు నిరుద్యోగులు అందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు.....ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ ములుగు జిల్లా ఉపాధ్యక్షుడు అంకని వీర్రాజు, ఆదివాసీ గిరిజన సంగం టీఏజీఎస్ మంగపేట మండలం నాయకులు కొమరం సందీప్ కుమార్, ఎస్ఎఫ్ఐ మంగపేట మండలం నాయకులు షఫీ, శివ, కేశవ్, భాష తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: