CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సోమవారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం లో పాల్గొని జయప్రదం చేయండి

Share it:

 


ఈ ముట్టడి లో ప్రతి దళిత బిడ్డ స్వచ్చందంగా పాల్గొనాలి

మనం మన జెండా మన అజెండా భుజానికి ఎత్తుకుందాం


సురేష్ గుగ్గిళ్ల ఎమ్మార్పి ఎస్ నాయకులు

మన్యం టీవీ మంగపేట.



ములుగు జిల్లా లో 9.08.2021సోమవారం నాడు కలెక్టర్ ముట్టడికార్యక్రమం దళితుల శ్రేయస్సు కొరకు దళిత బంధు తెలంగాణా యావత్ దళిత బిడ్డలకు పదిలక్షల రూపాయలు ఇవ్వాలి అని తలపెట్టిన ఈ మహాత్ కార్యక్రమం లో ప్రతి ఒక్కరూ పాల్గొని మన ఆత్మ గౌరవాన్ని చాటుకోవాలని ఈ సందర్బంగా గుగ్గిళ్ల సురేష్ మాదిగ తెలియజేసారు.

మంగపేట మండలం మరియు ఏటూరునాగారం తాడ్వాయి కన్నాయిగూడెం వాజేడు వెంకటాపురం 6 మండల నాయకులు అందరు ఆ ఆ మండలాల యువ నాయకులను, గ్రామ ప్రజలను ఈ ఆరు మండలాల ప్రజలను వేల సంఖ్యలో తరలి రావాలి మంద కృష్ణ మాదిగ ఆశయాల మేరకు మన దళిత ప్రజలు పెద్ద ఎత్తున దండులా తరలి రావాలి. కలక్టర్ ముట్టడికి ప్రతి ఒక దళితులకు దళిత బందు ఇవ్వాలి అని చేసే శాంతియుత కలెక్టరేట్ ముట్టడికి రావడం మన బాధ్యత.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులను మోసం చేయడానికే ఇంతకు ముందు ఎన్నికలో ప్రతి నిరుపేదలకు డబల్ బెడు రూము లు కట్టిస్తాను అన్నారు, తర్వాత ప్రతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం నుండి ప్రతి కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇస్తాను అని తెలంగాణ ప్రభుత్వం దళితులని మోసం చేసి ఎన్నికలో గెలవడం జరుగుతుంది దళితుడినే ముఖ్యమంత్రి ని చేస్తా అన్నాడు, చేయలేదు, ఇపుడుకుడా అలాగే హుజురాబాద్ ఎన్నికలో ఎట్లా అయినా గెలవడానీకే ఈ కుప్పి గంతులు వేస్తున్నాడు. ముఖ్యంగా మన దళిత ప్రజలు, సీనియర్ నాయకులు యువ నాయకులు గమనించాలి దళిత బందు 119 నియోజకవర్గ వర్గాలలో ఒక రోజే అమలు చేయాలి. అందుకే 09.08.2021 నాడు అందరు ములుగు ఉదయం 10 గంటలకు రావాలి. మనం మన జెండా, మన అజెండా మొద్దాం, ఎవరిదో జెండా, అజెండా మనం ఎందుకు మోయాలి. మన జెండా మనమే మోసుకొనిమన అజెండా ప్రకారం 2023 లో దళిత సీఎంకి పట్టాభిషేకం చేద్దాం.ఎవరి కోసమో మనం పోరాడి సీఎం చేస్తే మనకు ప్రయోజనం ఏమిలేదు కాబట్టి దళితుడిడే సీఎం అయితే ప్రతి పేద కుటుంబానికి అన్ని ప్రయోజనాలు కలుగుతాయి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని యువ నాయకత్వం ముందు నడవాలి అని యువ నాయకత్వం తలుసుకుంటే ఏదైనా సాధిస్తాం.సీనియర్ నాయకులు ఏటూరునాగారం వావిలాల స్వామి మాదిగ, తాడువాయి మండల అధ్యక్షుడు నాగార్జున లంజపెళ్లి మధు, ఆతుకూరి లక్మను,గజాల ప్రసాద్ మాదిగ,వాజేడు అధ్యక్షులు వారికిల్ల వేణు మాదిగ,అందరూ కలక్టర్ ముట్టడికి గ్రామ ప్రజలను ఎక్కువ సంఖ్యలో తీసుకరావాలని పత్రికాముఖంగా ఎమ్మార్పి ఎస్ గుగ్గిళ్ల సురేష్ మాదిగ తెలియజేసారు.

Share it:

Post A Comment: