CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

🔹 ఆత్మహత్యలు వద్దు..తెగించి పోరాడండి

Share it:



🔹 *ఫారెస్టు సిబ్బందిని తరిమేసి పోడును దక్కించుకోవాలి


🔹 పేదోడి బ్రతుకు లాక్కుంటే కేసీఆర్ కు పతనం తప్పదు


🔸 సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు


🔹 సీతాయిగూడెం పోడు క్షేత్రాలను సందర్శించిన సీపీఐ బృందం


🔹 ఫారెస్ట్ బాధిత రైతులను పరామర్శించిన కూనంనేని, సాబీర్ పాషా

మన్యం టీవి,చండ్రుగొండ :ఆత్మహత్యలతో పోడు సమస్యకు పారిస్కారం లభించిందని, తెగింపు పోరాటాలే సమస్యకు పసిష్కారం చూపుతాయని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టంచేశారు. మండలంలోని సీతాయిగూడెం గ్రామ పరిధిలోని వివాదాస్పద పోడు భూములను సోమవారం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషాతో కలిసి  కూనంనేని పరిశీలించారు. అనంతరం పోడు వివాదంలో గాయపడిన, ఆత్మహత్యాయత్నం చేసిన పలువురు పొదురైతులను పరామర్శించారు. ఈ సందర్బంగా కూనంనేని మాట్లాడుతూ పేదల బ్రతుదెరువు, సంక్షేమకంటే హరితహారానికే కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నాడని, పోడు వ్యవసాయానికి, హరితహారనికి తేడా ఏంటో చెప్పాలన్నారు. అభివృద్ధి మాటున  ప్రాజెక్టులు, ఓసి నిర్మాణంతో అటవీ సంపద ద్వంసం అవుతుంటే సహకరిస్తున్న పాలకులు బ్రతుకు కోసం పంటలను సాగుచేసుకుంటే నిర్బంధాలకు పాల్పడటం దారుణమన్నారు. కలప మాఫియాను పట్టించుకొకుండా అటవీ శాఖా అధికారులు పెదాలపై జులుం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. 2005 అటవీ హక్కుల చట్టాన్ని తుంగలో తొక్కి పోడు రైతులను రాష్ట్ర ప్రభుత్వం గోస పెడుతోందని అన్నారు. పోడు క్షేత్రాలనుంచి అటవీ సిబ్బందిని వెనక్కు పంపాలని, లేనిపక్షంలో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు. చండ్రుగొండ మండలం సీతాయిగూడెంలో పంటల ద్వంసానికి పాల్పడిన ఫారెస్ట్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, వారి ఆగడాలను అదుపు చేయాలనీ డిమాండ్ చేశారు. పంటల ద్వంశంపై జరిగిన నష్టానికి ప్రభుత్వమే భాద్యత వహించి పేదలకు పరిహారం చెల్లించాలని, ముఖ్యమంత్రి హామీ మేరకు సాగులో ఉన్న ప్రతి ఎకరాకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా మాట్లాడుతూ పోడు రైతులు అధైర్య పడొద్దని కమ్యూనిస్టు అండగా ఉంటుందని, భూములపై హక్కు లభించేవరకు ప్రభుత్వంపై పోరాడే భాద్యతను కమ్మూనిస్టు పార్టీ స్వీకరిస్తుందని హామీ ఇచ్చారు. ప్రతినిధి బృందంలో సిపిఐ చండ్రుగొండ మండల కార్యదర్శి బొర్రా కేశవరావు, జిల్లా సమితి సభ్యులు జడ శ్రీను, గుర్రం ప్రతాప్, బండి వెంకటయ్య, కుంజా ఈశ్వరమ్మ, కె.ఆంజనేయులు తదితరులు.

Share it:

Post A Comment: