CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

శ్రీ కృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో.. శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు...

Share it:

 




మన్యం టీవీ : జూలూరుపాడు, ఆగస్టు 30, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని కాకర్ల గ్రామ శివారు గుట్టపై వెలసియున్న శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో సోమవారం శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సంతాన వేణుగోపాలస్వామి ఆలయం అతి పురాతనమైన, ప్రసిద్ధి కలిగిన దేవాలయము కావడంతో పండుగల రోజు లలో దూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని, భక్తులు మొక్కులు చెల్లించుకుని శ్రీ సంతాన వేణుగోపాల స్వామిని దర్శించుకుంటార ని ఆలయ ప్రధాన పూజారి తెలియజేశారు. ఆలయం అతి పురాతనమైనది కావడంతో శిధిలావస్థలో ఉంన్నందున దాన్ని తొలగించి దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు దాతల సహకారంతో నూతన ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, అతి త్వరలొ ఆలయ పునర్నిర్మాణం జరిగిన తర్వాత అత్యంత వైభవంగా ప్రారంభోత్సవం చేస్తామని శ్రీ కృష్ణ సేవా సమితి సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణ సేవా సమితి సభ్యులు,అల్లాడి లింగారావు, డిల్లి వెంకటేశ్వర్లు, అల్లాడి నర్సింహరావు, చెరుకుమల్లి కష్ణాయ్య, హరి శ్రీధర్, హరి రాంప్రసాద్, మిరియాలు రమేష్, కంపసాటి వెంకటేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: