CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

Share it:

 


*75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భముగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క.

మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం యందు 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి మరియు ములుగు నియోజక వర్గ ఎమ్మెల్యే దనసరి సీతక్క విచ్చేసి జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో సీతక్క  మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి ఏర్పడిన కూటమే కాంగ్రెస్ పార్టీ అని,దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహనీయులు కృషి చేశారని, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 1942 ఆగస్టు 8న క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తీర్మానంలో కాంగ్రెస్ బ్రిటీష్ ప్రభుత్వం భారత ప్రజల కోరికలను ఆమోదించనట్లయితే దేశవ్యాప్త సత్యాగ్రహానికి పిలుపునిచ్చింది.బొంబాయి లోని గొవలియ టాంక్ మైదానంలో (తరువాత క్రాంతి మైదానంగా మార్చబడినది) ఆగస్టు 8న సత్యాగ్రహంతో చావో-బ్రతుకో తేల్చుకోవాల్సిందిగా గాంధీ గారు ఇచ్చిన పిలుపు ఉద్యమంమీద ఆయన నమ్మకానికి మచ్చుతునక. ఆ ఉపన్యాసంలో ప్రజలను స్వతంత్ర భారత పౌరులుగా జీవించాలని, బ్రిటీష్ ప్రభుత్వ ఆజ్ఞలను ధిక్కరించాలని పిలుపునిచ్చారు. అప్పటికే భారత-బర్మా సరిహద్దులలో జాపాన్ సైన్య పురోగతితో అప్రమత్తమైన ప్రభుత్వం గాంధీని అఘాకాన్ పాలెస్లో, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని, జాతీయ నాయకత్వాన్ని అహ్మద్ నగర్ కోటలో బంధించింద. కాంగ్రెస్ ని నిషేధించటంతో పాటు గాంధీ గారి ఉపన్యాసం తరువాత 24 గంటలలోపే దాదాపు అందరు కాంగ్రెస్ నాయకులను ప్రభుత్వం నిర్బందించింది, వీరందరూ యుద్ధం సమయంలో జైలు జీవితం గడిపారు.దేశ వ్యాప్తంగా పెద్దయెత్తున ప్రదర్శనలు అందోళనలు జరిగాయి. కార్మికులు పెద్దయెత్తున సమ్మె చేసారు. ఉద్యమంలో పెద్దయెత్తున హింస చోటుచేసుకుంది.భారత విప్లవ సంఘాలు మిత్రరాజ్య సరఫరా వ్యవస్థలమీద బాంబు దాడులు చేశారు, ప్రభుత్వ ఆస్తులకు నిప్పు పెట్టారు. కాంగ్రెస్ ముస్లింలీగ్ వంటి ఇతర రాజకీయ శక్తుల మద్దత్తు పోందలేక పోయినప్పటికీ పెద్దయెత్తున ముస్లింల మద్దత్తు సంపాదించింది. బ్రిటష ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి దేశ వ్యాప్తంగా లక్షమందికి పైగా జైళ్ళకు పంపింది. ప్రజాందోళన మీద లాఠీ దాడి చేయటంమే కాక అపరాధ రుసుమును విధించింది.త్వరలోనే ఉద్యమం నాయకత్వంలేని ఆందోళనగా మారి అనేక ప్రాంతీయ విప్లవ సంఘాల చేతులలోకి మళ్ళంది.గాంధీ గారి అహింసాయుత సిద్దాంతాలకు వ్యతిరేకంగా అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి. మహాత్మాగాంధీ గారి అహింస మార్గమే దేశానికి స్వాతంత్య్రం సిద్దించేలా చేసింది అని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బానోత్ రవి చందర్,జిల్లా నాయకులు,మండల నాయకులు మండల అనుబంధ సంఘాల అధ్యక్షులు,ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: