CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉ఎమ్మెల్యే వనమా కు మున్సిపల్ చైర్ పర్సన్ - కౌన్సిల్ సభ్యులు ఆత్మీయ సన్మానం

Share it:

 


భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 31 (మన్యం టీవీ) కొత్తగూడెం ప్రజల ముద్దుబిడ్డ కిన్నెరసాని జల దాత, పోస్ట్ ఆఫీస్ సెంటర్ ను అంబేద్కర్ సెంటర్ గా నామకరణం చేసి వాటర్ ఫౌంటెన్ ఏర్పాటు చేసి అందులో రాజ్యాంగ నేత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కి మంగళవారం నాడు కొత్తగూడెం మున్సిపల్ కౌన్సిల్ తరపున మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా చైర్ పర్సన్ కాపుసీతాలక్ష్మి మాట్లాడుతూ కొత్తగూడెం మున్సిపాలిటీ ని అభివృద్ధి బాటలో తీసుకొని వెళుతున్నా వనమా వెంకటేశ్వరరావు కి ఈ రోజు కొత్తగూడెం కౌన్సిల్ తరపున సన్మానం చేయడం చాలా ఆనందకరంగా ఉందని అభివృద్ధి అంటే వనమా,వనమా అంటే అభివృద్ధి అని అన్నారు.

కొత్తగూడెం మున్సిపాలిటీ అభివృద్ధి బాటలో నడుస్తుంది.అంటే అది కేవలం వనమా గారికే సాధ్యం అని ఈ సందర్భంగా శాసన సభ్యునికి కౌన్సిల్ సభ్యులు అందరూ కలిసి శాలువా కప్పి గజమాల వేసి సన్మానించడం జరిగింది. మున్సిపల్ చైర్ పర్సన్ కాపుసీతాలక్ష్మి మరియు కౌన్సిల్ సభ్యులు చేసుకున్న అదృష్టమని ఈ కౌన్సిల్ ఏర్పడ్డాకనే కొత్తగూడెం మున్సిపాలిటీ లో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యునికి కృతజ్ఞతలు తెలిపారు.ఇ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దామోదర్, కౌన్సిలర్స్, కో-ఆప్షన్ సభ్యులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

Post A Comment: