CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

హుజురాబాద్ ఎలక్షన్ కంటే ముందు రాష్ట్రమంతటా దళిత బంధు పథకం అమలు చేయాలి.

Share it:


మన్యం టీవీ కొత్తగూడెం, ఆగస్టు 8:-

ఆదివారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాల మహానాడు కార్యాలయంలో దళిత సంఘాల నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశంలో సోమవారం నాడు జరగబోవు కలెక్టరేట్ ముందు నిరసన మరియు ధర్నా కార్యక్రమం గురించి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు పూల రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం హుజురాబాద్ ఎలక్షన్ కంటే ముందు రాష్ట్రమంతటా అమలు చేయాలని ఎస్సీ ఉప కులాలు అయినటువంటి59 కులాల జాతీయ మరియు రాష్ట్ర నాయకత్వాలు రేపు అనగా సోమవారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల కలెక్టరేట్ ల ముందు నిరసన మరియు ధర్నా కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరేట్ ముందు రేపు ఉదయం 10 గంటలకు ధర్నా మరియు నిరసన కార్యక్రమం నిర్వహించబడును కావున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి అన్ని దళిత సంఘాల నాయకులు  మరియు దళితులు అందరు కూడా హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మాల మహానాడు  జిల్లా నాయకులు గుడివాడ రాము, కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు సబ్బవరపు నాగేందర్ మరియు  కవల నాగేష్, భూపతి అశోక్, జగ్జీవన్ రామ్, వెంకట్, రాము తదితర దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: