CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గుట్కా మాఫియాకు సింహ స్వప్నం సిఐ భానుప్రకాష్

Share it:



✍️మేకల మహేష్ యాదవ్,మణుగూరు మన్యం మనుగడ ప్రతినిధి

👉 గుట్కా రాయుళ్ల ఆటలకు చెక్ పెట్టిన మణుగూరు సిఐ భాను ప్రకాష్

👉 సి ఐ చర్యలతో గుట్కా వ్యాపారం లో వణుకు

👉నిలిచిన గుట్కా విక్రయాలు

👉 గుట్కా పాన్ మసాలా తయారు చేస్తే కఠిన చర్యలు

👉 మన్యం టీవీ తో సిఐ భాను ప్రకాష్

మన్యం మనుగడ, మణుగూరు:
గుట్కా పాన్ మసాలా మూలంగా విలువైన జీవితాలు మధ్యలోనే గాలిలో కలిసిపోతున్నాయి. చిన్నా పెద్దా యువత అన్న తేడా లేకుండా గుట్కాల మత్తులో బానిస అయ్యారు. ఈ నేపథ్యంలో గుట్కా మహమ్మారి నిర్మూలనకు మణుగూరు సిఐ భాను ప్రకాష్ నడుంబిగించారు .ఈ క్రమంలో గుట్కా రాయుళ్ల పై ఉక్కుపాదం మోపారు. మణుగూరు మండల వ్యాప్తంగా పటిష్టమైన నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకుని గుట్కామాఫియా ఆటలను కట్టడి చేశారు. మణుగూరు ఎస్సైలు నరేష్,బట్టా పురుషోత్తం లకు మార్గ నిర్ధేశం చేస్తూ గుట్టుగా సాగుతున్న గుట్కావ్యాపారానికి అడ్డుకట్ట వేశారు. అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నారు పలువురు పై కేసు నమోదు చేసి జైలు కి పంపించారు. మణుగూరు మండలం లోని సాంబయి గూడెం, చిక్కుడు గుంట, మెయిన్ రోడ్డు శివ లింగాపురంలో విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో లక్షలాది అంబర్ గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.సీఐ భాను ప్రకాష్ గుట్కా వ్యాపారస్తులు పై ఉక్కుపాదం మోపడంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


గుట్కా వ్యాపారం నిర్వహిస్తే కఠిన చర్యలు : సిఐ భాను ప్రకాష్

మణుగూరు మండల వ్యాప్తంగా నిషేధిత గుట్కా వ్యాపారానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మణుగూరు సీఐ భానుప్రకాష్ హెచ్చరించారు. మట్కా వ్యాపారం నిర్వహిస్తున్న వారి సమాచారం పోలీస్ శాఖ అందజేయాలని ఆయన ప్రజలను కోరారు.

Share it:

TELANGANA

Post A Comment: