CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉న్యూమోకాల్ న్యుమోనియా చిన్నారులను రక్షించడానికి తప్పనిసరిగా టీకా వేయించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.

Share it:


భద్రాద్రి కొత్తగూడెం:- ఆగష్టు 18, (మన్యం మీడియా) బుధవారం జిల్లా ప్రధాన ఆసుపత్రి నందు న్యుమోకాకల్ కంజుగేట్ వ్యాక్సిన్ ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి చిన్నారులకు టీకా వేయు కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులను న్యుమోకాకల్ న్యుమోనియా నుండి రక్షించడానికి నూతన వ్యాక్సిన్ అందుబాటులోకి. రావడం చాలా సంతోషమని, ఈ వ్యాక్సిన్ చిన్నారులను వ్యాధి నుండి రక్షింస్తుందని చెప్పారు. ఊపిరి తిత్తులను పివిసి వ్యాక్సిన్ న్యుమోకాకల్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు నుండి సమర్ధవంతంగా పనిచేస్తుందని, స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్లు మెనింజైటిస్, న్యుమోనియా మరియు సెఫ్టిసిమియా వంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్లు కు గురవుతారని, దీని వల్ల మెదడు దెబ్బతిని చిన్నారులు మరణించే ప్రమాదం ఉందని చెప్పారు. ఈ బ్యాక్టీరియా నుండి చిన్నారులను కాపాడేందుకు ప్రభుత్వం పివిసి వ్యాక్సిన్ను అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, డిస్పెన్సరీలు, పిహెసిలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఉచితంగా అందచేయనున్నామని ఆయన వివరించారు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుందని, ఇది ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి జరుగుతుందని ఆయన చెప్పారు. దగ్గు మరియు తుమ్ములు ద్వారా ఒకరి నుండి మరొకరికి ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని, చిన్నారులు శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది పడతారని చెప్పారు. క్షేత్రస్థాయిలో వ్యాక్సిన్ ప్రక్రియపై ఆశా కార్యకర్తలు, ఏ.ఎన్.ఎం లు, అంగన్వాడీ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. శిశువులకు ఈ వ్యాక్సిన్ మొదటి డోసు 6 వారాలలోపు, రెండవ డోసు 14 వారాలు లోపు తదుపరి బూస్టర్ డోస్ 9 నెలలలోపు వేయించాలని ఆయన చెప్పారు. టీకా  కొరత లేకుండా సమృద్ధిగా అన్ని ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలని, ఏ ఒక్క చిన్నారికి కూడా వ్యాక్సిన్ అందలేదనే పరిస్థితులు రావొద్దని మనందరం చిన్నారులను రక్షించేందుకు తప్పని సరిగా వ్యాక్సిన్ వేయించు విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన వివరించారు. తల్లిదండ్రులు వ్యానేషన్ కొరకు వచ్చేటప్పుడు తల్లిదండ్రులు తప్పని సరిగా నమోదు చేయబడిన కార్డును వెంట తెచ్చుకోవాలని చెప్పారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహించే సిబ్బంది. యొక్క డ్యూటి చార్టులు ఏర్పాటు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. పేరు, సెల్ఫోన్ నెంబరు, సమయాలను తెలియచేయాలని చెప్పారు. ఆక్సిజన్ జనరేటర్ ప్లాంటు ఏర్పాటు పనులను పరిశీలించారు. వచ్చే నెలలో ఆక్సిజన్ జనరేటర్ ప్లాంటు, రామవరంలో నిర్మిస్తున్న మాతా శిశు కేంద్ర ఆసుపత్రి సేవలకు అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సెప్టెంబర్ 2వ వారంలోగా ప్రారంబించడానికి సిద్ధం చేయాలని చెప్పారు. ఆసుపత్రికి వెళ్లడానికి రహదారి సౌకర్యం, కల్వర్టుతో పాటు ఆసుపత్రిని రంగులతో అందంగా తయారు చేయాలని, ఆసుపత్రి పరిసరాలు. పరిసరాలు పరిశుభ్రంగా ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ప్రారంభించిన తదుపరి ఎటువంటి జాష్యం లేకుండా వైద్య సేవలు నిర్వహించాలని అందుకు కావాల్సిన పరికరాలను కూడా సిద్ధం చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. సింగరేణి సంస్థలో సర్వేయర్ గా విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన టి గట్టయ్య నాపా అసోషియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి 52వేల విలువ గల ఆక్సిజన్ కాన్ సెంట్రేటర్ విరాళంగా ఇవ్వడం పట్ల కలెక్టర్ అభినందించారు. ఆసుపత్రుల్లో పేదల వైద్య సేవలకు దాతలు సహకారాన్ని అందిస్తుండటం చాలా సంతోషమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ ముక్కంటేశ్వరావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సరళ, ఆర్ ఎమ్ ఓ డాక్టర్ రవిబాబు, వైద్యులు వినోద్, నాగేంద్రప్రసాద్, చేతన్, సుజాత, నాపా సభ్యులు డాక్టర్ నరేష్, డాక్టర్ లలిత తదితరులు పాల్గొన్నారు..

Share it:

Post A Comment: