CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గోవిందరావుపేట మండల మొట్లగుడెం,ప్రాజెక్టునగర్, టప్పమంచ గ్రామాలలో కరోనా బాధిత కుటుంబాలను పరామర్శించి నిత్యావసర సరుకులు అందించిన ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

గోవిందరావు పేట మండల మొట్లగూడెం,టప్పమంచ, ప్రాజెక్టునగర్ గ్రామాలలో కరోనతో బాధపడుతున్న కుటుంబాలను పరామర్శించి హైదరాబాద్ కు చెందిన *సమరిటన్స్ ఫర్ ది నేషన్* స్వచ్చంధ సేవ సంస్థల సహకారంతో 45కుటుంబాలకు నిత్యావసర సరుకులు మరియు మెడికల్ కిట్లు ఏఐసీసీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క అందించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ కరోన వల్ల రోజువారీ కూలి పనులు చేసుకుంటూ బ్రతికే వారి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని అందుకే వారికి నెలకి సరిపడ నిత్యవసర సరుకులు, బియ్యం,పప్పులు,వంట నూనె, కూరగాయలు,సబ్బులు, వైద్యానికి సరిపడా కరోన మెడికల్ కిట్లు అందించారు. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చి ఉచిత వైద్యం అందించాలని అధికార పార్టీని పలుమార్లు కోరడం జరిగిందని, కనీసంగా తెరాస పార్టీ స్పందించలేదని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని వాపోయారు. ప్రాణ కరోనా తీవ్రత తగ్గింది కావచ్చు కానీ కరోనా మహమ్మారి ఇంకా తగ్గలేదు. అని ప్రజలందరూ తగు జాగ్రత్తలు వహించాలని,భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలని, బయటికి పోయి వచ్చాక శానిటైజరుతో చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. కరోనా సోకిన వారు ఆత్మస్థైర్యంతో ఉండాలని సీతక్క అన్నారు.ఈ కార్యక్రమంలో గోవిందరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కర్రీ నాగేంద్రబాబు,గోవిందరావుపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చింత క్రాంతి, మంగపేట మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రమేష్, మొట్లగుడేం సర్పంచ్ సనప సమ్మయ్య,మొట్లగుడెం మాజి ఎంపీటీసీ కుర్సం కన్నయ్య, మొట్లగుడెం వార్డ్ మెంబర్ ఉకే శశికుమార్,గ్రామ సీనియర్ నాయకులు అలుగుబెల్లి కన్నయ్య, సోయం పాపక్క 

మంగపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు బంటు రాజు,బేత వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: