CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రజా సంక్షేమమే టిఆర్ఎస్ పార్టీ ధ్యేయం

Share it:

 


*ములుగు జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి.

*టిఆర్ఎస్ పార్టీ తాడ్వాయి మండల విస్తృతస్థాయి సమావేశం.

మన్యం టీవీ ఏటూరు నాగారం

ప్రజా సంక్షేమమే టిఆర్ఎస్ పార్టీ ధ్యేయమని ములుగు జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి అన్నారు. బుధవారం ములుగు జిల్లా టిఆర్ఎస్ పార్టీ తాడ్వాయి మండల విస్తృత స్థాయి సమావేశం మండల అధ్యక్షుడు బండారు చంద్రయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ములుగు జిల్లా పరిషత్తు వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి హాజరై కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.ముందుగా కార్యకర్తలు వారి మనోభావాలను తెలియజేయాలని,మనసులో ఉన్నబాధను అంత చెప్పాలని సభాముఖంగా సూచన చేశారు.కార్యకర్తలు మాట్లాడిన ప్రతిదీ నోట్ చేసుకొని చివరగా మాట్లాడుతూ.అనంతరం ఆమే మాట్లాడుతూ,కార్యకర్తలే పార్టీకి బలం అన్నారు.మన జెండా ఎజెండా గులాబీ జెండానేనని,కలిసి కట్టుగా ముందుకు సాగి ప్రజల సంక్షేమ కోసం కార్యకర్తలు పాటుపడాలని సూచించారు. ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలని, సంక్షేమ కార్యక్రమాలలో సమన్వయంతో అందరూ కార్యకర్తలు పాల్గొనాలని సూచించారు.తనకు ఎటువంటి వర్గం లేదని పార్టీకి విధేయులు అందరికీ తాను అండగా నిలుస్తానని ప్రకటించారు. కేసీఆర్,కేటీఆర్ నాయకత్వంలో గులాబీ జెండాలు ఎత్తాలని, ప్రతి కార్యకర్త జై తెలంగాణ అని జై కొట్టాలని,వ్యక్తిగత పూజలు, గ్రూప్ లు, వర్గాలు పార్టీలో నిషేధమని హెచ్చరించారు. అన్నారం పెద్ద చెరువు, బంధాల,కాటాపూర్ రోడ్ల సమస్యలు తీవ్రతరంగా ఉన్నాయని,నియోజకవర్గ ఇన్చార్జి,మంత్రులు అవసరమైతే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుందాం అని అన్నారు.మన నాయకుడు కేసీఆర్,మన నినాదం ప్రజా సంక్షేమం అన్నారు. కార్యకర్తలు లేకపోతే ప్రజా సంక్షేమం లేదని, సంక్షేమ పథకాలు ప్రజాలకు అందుతున్నాయని,ప్రజలు సంతోషంగా ఉన్నారు.అని పేర్కొన్నారు.కార్యకర్తల కు కేసీఆర్ ముఖ్యమంత్రి అతి త్వరలోనే తీపి కబురు చెప్పబోతున్నాడు అని అన్నారు. ఏ సమస్య ఉన్న నా దృష్టికి తీసుకొని రావొచ్చని, ఎవరైనా డైరెక్ట్ గా రావొచ్చని అందుబాటులో ఉంటానని తెలిపారు.ముందు ముందు మండల పూర్తి స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకుందాం అన్నారు. ప్రతి సమస్యని అధిగమించడానికి బాటలు వేసుకుందామని అన్నారు.టిఆర్ఎస్ పార్టీ బిడ్డ కడుపులో పడ్డ అప్పటినుండి పెండ్లి అయ్యే వరకు అన్ని తానై చూసుకుంటుందని,కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదని, ప్రచారం తప్ప అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బండారి చంద్రయ్య,ఎంపీపీ గొంది వాణిశ్రీ,ఏటూరు నాగారం ఆత్మచైర్మన్ రమణయ్య,

మండలకో-ఆప్షన్ నెంబర్ దిలావర్ ఖాన్, టిఆర్ఎస్ పార్టీ మండల అధికార ప్రతినిధి ఆలేటి జైపాల్ రెడ్డి,పిఎస్ డైరెక్టర్ లింగా చారి,సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు గడ్డం అరుణ,సర్పంచులు చిడం బాబురావు,ఊకే మోహన్ రావు,పుల్లూరి గౌరమ్మ, గౌరబోయిన నాగేశ్వరరావు, జాజ చంద్రం,జిసిసి డైరెక్టర్ పులుసం పురుషోత్తం,టిఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు దిడ్డి మోహన్రావు,ముండ్రాతి రాజశ్రీ,జాగృతి నాయకురాలు పుర్రి స్వరూప, సీనియర్ నాయకులు పత్తి గోపాల్ రెడ్డి,సామ నాగమ్మ, సయ్యద్ హుస్సేన్, సిద్దబోయిన సురేందర్,ఇంద్రా రెడ్డి,గ్రామ కమిటీల అధ్యక్షులు,టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,మాజీ ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: