CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు ,వ్యవసాయ కార్మిక సంఘం నేత కృష్ణమూర్తి నివాళులు: సిపిఎం

Share it:

 


మన్యం టీవీ : ఇల్లందు


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో 15వ వర్ధంతి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు  కృష్ణమూర్తి  గారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సంఘం సీనియర్ నాయకులు దేవులపల్లి యాకయ్య  పూల మాల వేసి నివాళులర్పించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా ప్రజలకు దొరల చెంతన ఉన్న భూమిని లాక్కుని ప్రజలకు పంపిణీ చేయడం లో,దొరల పాలన ను అంతమొందిచడం లో కీలక పాత్ర పోషించారు.వ్యవసాయ కార్మిక సమస్యలపై  తాను చనిపోయేవరకి నిర్విరామంగా కృషి చేసిన మహనీయుడని అన్నారు. ఈ కార్యక్రమం లో అబ్దుల్ నబి,తాళ్లూరి కృష్ణ, ఆలేటి కిరణ్ కుమార్, మహిమూద్,నాగరాజు,లక్ష్మణ్ పాసీ,మోహన్ రావు,కోటేశ్వరరావు,పవన్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: