CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉శిథిలమైనా చర్మకారుల కాంప్లెక్స్ ను తొలగించి నూతన భవనాన్ని నిర్మించాలి.

Share it:


👉 చర్మకారుల సంఘము - షెడ్యూల్ కులాల ఐక్య వేదిక డిమాండ్.

మన్యం టీవీ, కొత్తగూడెం ఆగస్టు 3 :- మంగళవారం కొత్తగూడెం జిల్లా కేద్రం లో గల సూర్య ప్యాలెష్ ఎదురుగా ఉన్నటువంటి చర్మకారుల కాంప్లెక్స్ నుండి చర్మకారుల సంఘము మరియు షెడ్యూల్ కులాల ఐక్య వేదిక అధ్యర్యంలో సుమారు మూడువందల మంది తో ఛలో కలెక్టరేట్ కార్యక్రమానికి ప్రదర్చనగా సూర్య ప్యాలెష్ నుండి బస్టాండ్ మీదుగా కలెక్టర్ కార్యాలయం చేరుకొని కలెక్టర్ ప్రతినిధి డి ఆర్ ఓ అశోక చక్రవర్తి కి దళితుల 

సమస్యలతో కూడిన వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాదిగ దండోరా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

కుసపాటి శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ....

1983 ఆనాటి ప్రధాన మంత్రి అయిన ఇందిరాగాంధీ మొట్టమొదటి SC ST సబ్ ప్లాన్ కేంద్రనిధుల నుండి రోడ్డు సైడ్ చెప్పులు కుట్టుకునే చర్మకారులకు 

ఇరవై నాలుగు మంది కి సిమెంట్ రేకులతో దుకాణాలు ఏర్పాటు చేయడం జరిగింది 1986 లో పెద్ద ఎత్తున తుపాన్ వరదలు రావడం వల్ల అవన్నీ 70% కూలిపోయి మిగతావి ఇతరులు ఆక్రమించుకోవడం జరిగింది

అలాగే 30 సవత్సరాల క్రితం బాబు క్యాంప్ మెయిన్ రోడ్డు రామాలయం

గుడి ముందు గల షెడ్యూల్ కులాల దుకాణ సముదాయం SC కార్పొరేషన్ వారు ఉత్త గోడల పై స్లాబ్ వేసి 14 మందికి ఇవ్వడం జరిగింది అవి ఈరోజు శిదిలావస్థకు గురిఅయి కూలిపోయి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది...

ఈ రెండు కాంప్లెక్స్ సముదయాలను

కలెక్టర్ మా SC ST సబ్ ప్లాన్ నిధుల నుండి పాడైపోయిన దుకాణ సముదయాలను తొలగించి అదే స్థలము లో రెండు అంతస్తుల భవనాల కాంప్లెక్స్ లను నిర్మించాలని.వినతి పత్రం ఇవ్వడం జరిగింది

ఈ కార్యక్రమంలో మోరే భాస్కర్ రావు,ఎలక చందర్, వై.శ్రీనివాస్,రాజశేఖర్, బొమ్మేరా శ్రీనివాస్, ఇనగాలి మొగిలి, ఏలేటి వెంకటేశ్వర్లు, బొంకురి పరమేష్, కూరపాటి రవీందర్,చదలవడా సూరి, బెజ్జంకి సత్య నారాయణ, మరియు మహిళా నాయకురాలు మెదిని లక్ష్మి, నక్క సృజన, మాట్లా గాయత్రి, కృపవేణి తదితరులు పాల్గొన్నారు.....

Share it:

Post A Comment: