CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మావోయిస్టు లేఖలకు ఆదివాసీ సేన కు సంబంధం లేదు

Share it:

 



మావోయిస్టు లేఖలకు ఆదివాసీ సేన కు సంబంధం లేదు

     👉 ఆదివాసీ సేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు మడకం వేంకటేశ్వరరావు

మన్యం మనుగడ, వెబ్ డెస్క్:

👉ఇటివల కాలంలో పశ్చిమ గోదావరి జిల్లా కుకునురు మండలం లోని అమరవరం, వెలేరు శ్రీధర గ్రామలలో వెలిసిన CPI (మావోయిస్టు పార్టీ)  లేఖలకు , ఆదివాసీ సేన సంఘంనకు ఎటువంటి సంబంధం లేదని ఆదివాసీ సేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు మడకం వేంకటేశ్వరరావు అన్నారు. ఈ రోజు కుకునురు ఆదివాసీ సేన మండల కమిటీఆధ్వర్యంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఆదివాసీ సేన రాజ్యంగా చట్టబద్ధమైన పోరాటాలు మాత్రమే నిర్వహిస్తుందని ఎప్పటికి ఎలాంటి దుశ్చర్యలకు బెదిరింపులకు పాల్పడదని వారు అన్నారు. ఇవి మొత్తం కూడ పరిహరం పొందిన భూములను రక్షించటానికి ఓక పథకం ప్రకారం గిరిజనేతరులు కోంత మంది ఇలా చేస్తున్నారని మాకు అనుమానం ఉందని వారు ఆరోపణలు చేశారు. అలాగే గతం నుంచి కూడా మండల వ్యాప్తంగా పరిహరం పొందిన భూములలో ఆదివాసీ సేన ఆధ్వర్యంలో చట్టబద్ధమైన పోరాటాలు నిర్వహించామని, ఈ సంవత్సరం కూడ అలాంటి చట్టబద్ధమైన పోరాటామే నిర్వహిస్తామని కాని గతంలో ప్రభుత్వ అధికారులు, పోలీసులు గిరిజనేతరులకు వత్తాసు పలుకుతూ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతూ ఆమాయక ఆదివాసులను తప్పుడు కేసులలో ఇరికించి ఇబ్బందులకు గురి చేసారని వారు అన్నారు. అయిన పదే పదే పోలీసులు సివిల్ వివాదాలలో అనవసర జోక్యం తగదని వారు అన్నారు. మావోయిస్టు లేఖలు వెలిసిన దగ్గర నుంచి పరిహరం పొందిన భూములలో పనులు వేగవంతం అయ్యాయని, గిరిజనేతరులు 

 జామాయిల్ నరకిస్తున్నారని , గిరిజనులకు, గిరిజనేతరులకు ఏళ్ల తరబడి వివాదము జరుగుతు భూములు సేద్యంలో లేవని కాని ఇప్పుడు ఓక ప్రక్క గిరిజనులను విచారణ పేరుతో పోలిస్ స్టేషన్ కు పిలుస్తుంటే మరో పక్క గిరిజనేతరులు పరిహరం పొందిన భూములలో పనులు వేగవంతం అయ్యాయని, పోలీసులు, అధికారులు సమదానం చేప్పాలని దీనికి అంతరార్థం ఏమిటో చేప్పాలని వారు అన్నారు. ఆదే విధంగా ఆదివాసీ సేన కార్యకర్తలను ఆర్దరాత్రి, ఇష్టం వచ్చినట్లు విచారణ పేరుతో రోజుల తరబడి పిలుస్తు ఇబ్బందులు గురి చేయడం తగదని చట్ట ప్రకారంగా నోటీసులు పంపించి విచారణ కొనసాగించాలని వారు అన్నారు. ఈ సంవత్సరం పరిహరం పొందిన భూములలో గిరిజనులే సాగు చేస్తారని షెడ్యూల్డ్ ప్రాంతంలో పరిహరం పొందిన భూములలో గిరిజనులే సాగు చేయాలని చట్టం చేప్తుందని అలాంటి చట్టాన్ని అధికారులు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. పరిహరం పొందిన భూములలో గిరిజనేతరుల సాగులో ఉన్న వారి మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని వారి వలన షెడ్యూల్డ్ ప్రాంతంలో శాంతి భద్రతలకు ఉల్లంఘన జరిగే అవకాశం ఉందని వారు అన్నారు మావోయిస్టు లేఖల మీద ఉన్నత స్థాయి అధికారులు సమగ్రమైన విచారణ జరిపి నిజనిజాలను నిగ్గు తెల్చలని వారు డిమాండ్ చేశారు. అమరవరం లో కాక రాజు అధ్యక్షతన జరిగిన ఆదివాసీ సేన సమావేశంలో సంఘం లీగల్ అడ్వజర్ ఉకే రవి,మాల మహానాడు జిల్లా నాయకులు శ్రీను,మండల అధ్యక్షుడు మడివి మారయ్య,నాయకులు రమణయ్య,కాంతయ్య,వివిధ పంచాయతీ ల నాయకులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: